శాండల్వుడ్లో తెలుగు నిర్మాత | senior producer make his debut in sandalwood | Sakshi
Sakshi News home page

శాండల్వుడ్లో తెలుగు నిర్మాత

Published Thu, Nov 12 2015 2:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

శాండల్వుడ్లో తెలుగు నిర్మాత

శాండల్వుడ్లో తెలుగు నిర్మాత

టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నఅల్లు అరవింద్ శాండల్ వుడ్ ఎంట్ ఇస్తున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలను కూడా నిర్మించిన ఈ బిగ్ ప్రొడ్యూసర్ త్వరలో కన్నడ సినిమాకు  సిద్ధం అవుతున్నాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన 'భలే భలే మొగాడివోయ్' సినిమాను కన్నడలో రీమేక్ చేయనున్నాడు అల్లు అరవింద్.

భలే భలే మొగాడివోయ్ కన్నడ రీమేక్ రైట్స్ను రాక్లైన్ వెంకటేష్కు అమ్మేయాలని భావించినా,  తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ప్రస్తుతం రాక్లైన్ వెంకటేష్తో కలిసి తానే స్వయంగా ఈ సినిమాను కన్నడలో నిర్మించాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement