నిర్మాతగా మారుతున్న మరో టాప్ హీరో
హీరోగా మంచి ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా త్వరలోనే నిర్మాతగా మారుతున్నాడు. ఇప్పటికే నితిన్, అఖిల్ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా ప్రూవ్ చేసుకోగా, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలు నిర్మాతలుగా తమ సినిమాలను తామే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరంజీవి 150వ సినిమాతో నిర్మాతగా మారడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నాడట.
తెలుగులో సూపర్ సక్సెస్ సాధించిన భలే భలే మగాడివోయ్ సినిమాను కన్నడంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా, ఇతర భాషల్లో కూడా ఆయనే ప్రొడ్యూస్ చేస్తారని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం కన్నడgలో మాత్రం ఈ సినిమాను అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నాడట.
హీరోగా తెలుగుతో పాటు మళయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న బన్నీ ఈ సినిమాను నిర్మిస్తే అక్కడ సినిమాను ప్రమోట్ చేయటం కూడా ఈజీ అవుతుందని భావిస్తున్నారు. మరి హీరోగా సూపర్ సక్సెస్ అయిన బన్నీ నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.