అమెరికా వసూళ్లు రూ. 7.5 కోట్లు!
పెద్ద పెద్ద హీరోలు, భారీ సెట్టింగులు, అద్భుతమైన గ్రాఫిక్స్.. ఇవన్నీ ఏమీ లేకుండా కూడా మంచి హిట్ కొట్టొచ్చని, అద్భుతమైన వసూళ్లు సాధించొచ్చని నిరూపించిన సినిమా.. భలే భలే మగాడివోయ్. హీరో అంటే పెద్ద పర్సనాలిటీ, ఫైటింగులు, హీరోయిన్ కంటే ఎక్కువ స్థాయిలో కనపడుతూ మొత్తం సినిమాను డామినేట్ చేసే పాత్ర అన్నది అంతా పాత మాట. మతిమరుపు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండే ఓ పాత్రను హీరోగా ఎంచుకుని దర్శకుడు మారుతి తీసిన 'క్లీన్ కామెడీ' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అమెరికాలో కూడా చిన్న సినిమాల వసూళ్ల రికార్డులను బద్దలుకొడుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 7.5 కోట్ల రూపాయలు ఒక్క అమెరికాలోనే వసూలు చేసిందీ సినిమా. శేఖర్ కపూర్ లాంటి అగ్రస్థాయి దర్శకులు కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. హీరో పాత్ర అంటే ఇలాగే ఉండాలన్న నియమాలు ఏమీ పెట్టుకోకుండా కూడా సినిమా తీయొచ్చని ఈ సినిమా మంచి పాఠం చెప్పిందన్నారు. 3 యాక్ట్ స్ట్రక్చర్ అన్న పదాన్ని పక్కన పెట్టేశారని, సినీ గ్రామర్ ఏమీ లేకున్నా ఎంచక్కా చేశారని శేఖర్ కపూర్ అన్నారు. ఆర్టిస్టు తన సొంత గ్రామర్ను నిర్వచించడమే ఇందులో ఉందని ఆయన ప్రశంసించారు.
Lessons on Film : There are no rules. No traditions, no 3 act structure. No film grammar. It's only you the artist defining ur own grammar.
— Shekhar Kapur (@shekharkapur) September 15, 2015