Bhale Bhale Magadivoy
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం: నాని
హీరో నాని.. గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందంటున్నారు. ఏంటీ.. నాని సినిమాలు మానేసి మళ్లీ చదువు బాట పట్టాడనుకుంటున్నారా.. అస్సలు కాదు. నాని మాట్లాడుతుంది సినిమా గురించే. తన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ 'భలే భలే మగాడివోయ్' గురించి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న 'భలే భలే మగాడివోయ్' విడుదలై నేటికి 50 రోజులయ్యింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సినిమా విజయవంతంగా ఆడుతోంది. ఆ సంతోషాన్నే నాని ట్విట్టర్లో పంచుకున్నారు. 50 రోజులకు కూడా సినిమా దిగ్విజయంగా నడుస్తుందనే ఆనందంతో 'హౌ..ఆ.. హౌ? ఇది గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం' అంటూ నాని తన స్టైల్లో ట్వీట్ చేశారు.'భలే భలే మగాడివోయ్' సినిమా హీరో నానికే కాదు, డైరెక్టర్ మారుతి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్. లక్కరాజు అలియాస్ లక్కీ అనే ఓ మతిమరుపు మారాజు పాత్రలో నాని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాతోనే నాని అభిమానులతో 'నేచురల్ స్టార్' అనిపించుకున్నారు. How aa how? 50 Days and ON We made a film. U made it a blockbuster. Idhi ganithashastram lo ne o adbutha ghattam ;) pic.twitter.com/wpIkRlJgZ8 — Nani (@NameisNani) October 23, 2015 -
ఆ కథ తొలుత చిరంజీవిగారికే చెప్పా!
‘భలే భలే మగాడివోయ్’ సినిమా మారుతి లైఫ్‌ను భలే మలుపు తిప్పింది. అంతుకుముందు అతనిపై ఉన్న బ్యాడ్ ఇమేజ్నంతా ఈ సినమా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు మారుతిపై ఆడియన్స్‌లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇండస్ట్రీలో కూడా సేమ్ టు సేమ్. స్వయంకృషితో ఈ స్థాయికెదిగిన మారుతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కబుర్లు. ‘భలే భలే మగాడివోయ్’ కథ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని ఆలోచించకుండా రాసుకుంటూ వెళ్లిపోయాను. ఈ కథకు నానియే కరెక్ట్ అనుకున్నాను. ముందు తనకే ఈ కథ చెప్పాను. నాని ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్నాడు. ప్రేక్షకులందరూ నానిలో తమను తాము చూసుకున్నారు. నేను నమ్మినదాన్ని ప్రేక్షకులు అంగీకరించడం చాలా ఆనందంగా అనిపించింది. గత ఏడాది నేను పుట్టినరోజు జరుపుకోలేదు. ఎవరికీ తెలీదు కూడా. కానీ, ఈ బర్త్‌డే జరుపుకోవడానికి మంచి కారణం ఉంది. అదే ‘భలే భలే మగాడివోయ్’. ఈ చిత్రంతో ఓవర్సీస్లో కూడా జెండా పాతినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయనిది ఇవ్వాలనుకుంటాను నేను ఏ జానర్లోనైనా సినిమా తీయగలను. నా మీద ఓ ముద్ర పడటం ఇష్టం లేదు. నేనేం చేసినా నా ఫ్యామిలీ కోసమే చేశాను. వాళ్లను పోషించడానికి పడిన కష్టమిది. మెకానిక్‌గా, ఆర్ఙిస్ట్గా ఇలా ఏ పని చేసినా అక్కడే ఆగిపోవాలనుకోలేదు. ఇప్పుడు నేను డెరైక్షన్ చేస్తున్నాను. ఎప్పుడూ నేను నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడానికి చేసే ప్రయత్నమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. బన్నీ, వెంకటేశ్‌ల కోసం కథలు రెడీ చేస్తున్నా బన్నీ మంచి కథ చెప్పమని అడుగుతున్నాడు. నేను ఓ మంచి డెరైక్టర్‌గా ప్రూవ్ చేసుకుని అతని దగ్గరికి వెళ్లాలనుకున్నాను. ఫ్రెండ్షిప్ అనే ట్యాగ్‌తో వెళ్లడం నాకు ఇష్టం లేదు. వెంకటేశ్‌గారికి కూడా కథ రాస్తున్నా. అప్పట్లో అనుకున్న ‘రాధ’ సినిమా అయితే ఉండదు. ఒకసారి డిస్టర్బ్ అయ్యాక దాని జోలికి మాత్రం వెళ్లలేను. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేవి చిన్న సినిమాలే చిన్న సినిమా హిట్ చేయించడమే కష్టం. థియేటర్‌కు రప్పించి, ప్రేక్షకుల దగ్గర డబ్బులు వసూలు చే యాలి. పెద్ద సినిమాలకు అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మనం చిన్న తప్పులు చేసినా, హీరోల మీద అభిమానంతో తప్పులు పెద్ద పట్టించుకోరు. చిన్న సినిమాలకు అలా కాదు. చిన్న సినిమా బతికేతేనే ఇండస్ట్రీ నెక్ట్స్ లెవెలకు వెళుతుంది. చిన్న సినిమా ఎలా తీసినా చెల్లుతుందన్న అపోహలో చాలా మంది ఉన్నారు. దాని వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. అది చిన్న సినిమా కావచ్చు, క్వాలిటీ చిత్రాలను ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కోవలో ఉన్న ‘స్వామి రారా’, ‘ఉయ్యాల జంపాల’ ఇవన్నీ మంచి హిట్ అయ్యాయి. చిన్న సినిమాలకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద సినిమాలకు కూడా రాదు. మళ్లీ నిర్మాణమంటే ఆలోచిస్తా కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వాలని నేను కొన్ని తప్పులు చేశాను. దాని వల్ల ఆ సినిమాల అవుట్‌పుట్ కూడా నా ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. ఆ కారణంగా కొంత డిస్టర్బ్ అయ్యాను. చిన్న సినిమా చేసినా నాకు నచ్చితే, కాన్సెప్ట్ బాగుంటే వాటిని నిర్మిస్తాను. ఆ హీరోలందరూ అభినందించారు ‘భలే భలే మగాడివోయ్’ చూసి మహేశ్‌బాబు, ప్రభాస్ అందరూ అభినందించారు. చరణ్ అయితే అరగంట సేపు మాట్లాడారు. మొదట ఈ సినిమా కథ చిరంజీవిగారికే చెప్పాను. బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు. -
పవన్, మహేష్‌కు స్క్రిప్ట్ రెడీ
♦ నాని ఈజ్ ఉన్న నటుడు ♦ అటువంటి హీరోతో పని సులువు ♦ ‘భలే భలే మగాడివోయ్’ ఊహించిన విజయమే ♦ ‘సాక్షి’తో దర్శకుడు మారుతి అడల్ట్ కంటెంట్, డైలాగ్స్‌తో తక్కువ బడ్జెట్‌తో ‘ఈ రోజుల్లో’ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.. తరువాత వచ్చిన యూత్‌ఫుల్ సినిమా ‘బస్టాప్’ కూడా సక్సెస్, ‘ప్రేమకథా చిత్రమ్’ లాంటి హారర్ కామెడీని మొదటి సారి తెరకెక్కించి ట్రెండ్ సృష్టించాడు. ఇప్పుడు తన మార్క్ సినిమాలకు దూరంగా ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా విజయయాత్రలో భాగంగా విశాఖ వచ్చిన డెరైక్టర్ మారుతీతో చిట్‌చాట్. - పెదగంట్యాడ మీ పూర్తి పేరు, ఇతర వివరాలు చాలా మందికి తెలియదనుకుంటా...? మారుతీ దాసరి నా పేరు. నేను పుట్టి పెరిగిందంతా మచిలీపట్నం. గ్రాడ్యుయేషన్ చదవడానికి హైదరాబాద్ వెళ్లా. ఎంతో మందిలాగే నాకు సినిమాలంటే పిచ్చి. ఇప్పుడున్న సదుపాయాలేవి అప్పట్లో లేవు.. అయినా సినిమాలకు పనిచేయాలనే పిచ్చి కల. ఈ నేపథ్యంలో కంప్యూటర్, గ్రాఫిక్స్ నేర్చుకొని యానిమేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాను. చిరంజీవితో పరిచయం ఎలా? చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. నా యానిమేషన్ ఇన్స్టిట్యూట్లో అల్లు అర్జున్ యానిమేషన్ నేర్చుకున్న సమయంలో ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. చిరంజీవి అప్పట్లో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీకి జెండా రూపక ల్పన చేశాను. ఆ సమయంలో నాలో డెరైక్టర్ ఉన్నాడని మెగాస్టార్ గుర్తించి ప్రోత్సహించారు. ‘ఈ రోజుల్లో’ ప్రయోగం ఎలా చేశారు ? రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో సినిమా తీయలేదు. ప్రొడ్యూసర్స్‌కి నా టేకింగ్ గురించి అవగాహన ఉంటుందని సీడీ రూపంలోకి మార్చడానికి తీశాను. రామ్‌గోపాల్‌వర్మ అప్పట్లో ‘దొంగల ముఠా’ సినిమాను ఫైవ్డి కెమెరాతో తీశారు. ఆయనను అనుసరించి ఫైవ్డి కెమెరాతో సినిమా తీశాను.. ఫ్రెండ్స్ చూసి చాలా బాగా వచ్చిందని రిలీజ్ చేద్దామన్నారు. అలా యాదృ చ్ఛికంగా జరిగిందే తప్ప ‘ఈ రోజుల్లో’ సినిమాతో ఈ స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోలేదు. ‘భలేభలే మగాడివోయ్’లో మతి మరుపు క్యారెక్టర్ చేయాలని ఎందుకనిపించింది ? అందరికీ మతిమరుపు ఉంటుంది. నేను కూడా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతుంటాను. ఎవరైనా గుర్తు పట్టి ఏంటి సార్.. ఇలా వచ్చారు అంటే మళ్లీ నాలుక్కరుచుకొని ఏదో మేనేజ్ చేసి వెనక్కి వచ్చేస్తుంటాను. అందుకే ఇప్పుడు డ్రైవింగ్ బాధ్యతలు డ్రైవర్‌కి అప్పగించాను. మతిమరుపు డోస్ బాగా పెంచితే లైఫ్ ఎలా ఎంటుందనే ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ సినిమా. నాని ఈ సినిమాకి యాప్ట్ అని ఎలా అనుకున్నారు? ఎలా ఒప్పించారు? నాని చాలా ఈజ్ ఉన్న నటుడు. ఇప్పటివరకూ ఎవరూ అతన్ని సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ నాలో ఉండేది. మొదట్లో వేరే హీరోతో చేద్దాం అనుకున్నా మైండ్‌లో నుంచి నాని మాత్రం వెళ్లలేదు. సినిమాకి కీలకమైన ఎమోషనల్ సీన్ కోసం రాత్రంతా కష్టపడి అంతా రెడీ చేశాను. నాని వచ్చి క్యాజువల్‌గా ఐదు నిమిషాల్లో టేక్ ఓకే చేసి తర్వాత సీన్ ఏంటి అన్నాడు. ఐదు నిమిషాల్లో ప్యాకప్ చెప్పి అందరినీ ఇంటికి పంపించేశాను. ఇలాంటి ఆర్టిస్ట్ ఉంటే ఖర్చు చాలా తగ్గుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా? అన్ని రకాల సినిమాలు తీయాలని ఉంది. అలాగే చేస్తూ వచ్చాను. స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబులతో సినిమా చేయాలని ఉంది. వారికి తగ్గ ఎమోషన్స్‌తో స్క్రిప్ట్ కూడా తయారు చేసి ఉంచాను. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. వైజాగ్‌తో మీ అనుభంధం ఎప్పుడు వచ్చినా బీచ్‌లో కూర్చుంటాను. ఇక్కడ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వైజాగ్‌లో ఒక సినిమా తీయాలని ఉంది. ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చుతుంది. -
అమెరికా వసూళ్లు రూ. 7.5 కోట్లు!
పెద్ద పెద్ద హీరోలు, భారీ సెట్టింగులు, అద్భుతమైన గ్రాఫిక్స్.. ఇవన్నీ ఏమీ లేకుండా కూడా మంచి హిట్ కొట్టొచ్చని, అద్భుతమైన వసూళ్లు సాధించొచ్చని నిరూపించిన సినిమా.. భలే భలే మగాడివోయ్. హీరో అంటే పెద్ద పర్సనాలిటీ, ఫైటింగులు, హీరోయిన్ కంటే ఎక్కువ స్థాయిలో కనపడుతూ మొత్తం సినిమాను డామినేట్ చేసే పాత్ర అన్నది అంతా పాత మాట. మతిమరుపు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే ఓ పాత్రను హీరోగా ఎంచుకుని దర్శకుడు మారుతి తీసిన 'క్లీన్ కామెడీ' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమెరికాలో కూడా చిన్న సినిమాల వసూళ్ల రికార్డులను బద్దలుకొడుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 7.5 కోట్ల రూపాయలు ఒక్క అమెరికాలోనే వసూలు చేసిందీ సినిమా. శేఖర్ కపూర్ లాంటి అగ్రస్థాయి దర్శకులు కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. హీరో పాత్ర అంటే ఇలాగే ఉండాలన్న నియమాలు ఏమీ పెట్టుకోకుండా కూడా సినిమా తీయొచ్చని ఈ సినిమా మంచి పాఠం చెప్పిందన్నారు. 3 యాక్ట్ స్ట్రక్చర్ అన్న పదాన్ని పక్కన పెట్టేశారని, సినీ గ్రామర్ ఏమీ లేకున్నా ఎంచక్కా చేశారని శేఖర్ కపూర్ అన్నారు. ఆర్టిస్టు తన సొంత గ్రామర్‌ను నిర్వచించడమే ఇందులో ఉందని ఆయన ప్రశంసించారు. Lessons on Film : There are no rules. No traditions, no 3 act structure. No film grammar. It's only you the artist defining ur own grammar. — Shekhar Kapur (@shekharkapur) September 15, 2015 -
డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!
కొత్త సినిమాలు గురూ! ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి... అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే. ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో... అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్. మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది. ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి. ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ, మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి. క్లాసూ మాసూ తేడా లేకుండా... దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు. డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి. భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి. దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు. ఇంతకీ కథేంటి? శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది. కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్ట. తమిళ కథ... తెలుగు యాక్షన్... ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు. ‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది. సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్. రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్. దర్శకుడు దేవ కట్ట భలే.. భలే తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే! ఈ కథేంటి? శ్రీమతి, శ్రీఆంజనేయు లు (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు. ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది. ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా. నేచురల్ యాక్టింగ్ ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్. ‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా.. హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్టైనర్ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు. దర్శకుడు మారుతి తెర వెనుక ముచ్చట్లు ►‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి. ► ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు. ► తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు. ► షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు. ► మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు. ► చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు. ►‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు. ►మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ►‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు. ►ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. ►‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు ►హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో విలన్‌గా పరిచయమయ్యారు. ►ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు. -
నేను అమాయకురాల్ని!
కొంచెం అల్లరిపిల్లలా, కొంచెం అమాయకంగా, ఇంకొంచెం గారంగా... ఇలా లావణ్యా త్రిపాఠీలో బోల్డన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్‌నీ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించగల సత్తా ఉంది కాబట్టే, తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారామె. నాని సరసన లావణ్య నటించిన ‘భలే భలే మగాడివోయ్’ వచ్చే నెల 4న విడుదల కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్, జీఏ2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు ఇతర విషయాలను కూడా లావణ్య ఈ విధంగా పంచుకున్నారు. ►నా రియల్ లైఫ్‌కి కొంచెం భిన్నంగా ఉన్న పాత్రను ‘భలే భలే మగాడివోయ్’లో చేశాను. ఇందులో నేను అమాయకురాల్ని. మంచి కూచిపూడి డ్యాన్సర్‌ని. నా చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకోవడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. చిత్రీకరణ సమయంలో రోజుకి అరగంట ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమాలో నన్ను చూసి, భలే భలే అమ్మాయి అనుకుంటారు. ఓవరాల్‌గా అందరికీ బాగా నచ్చుతాను. ►‘ఈగ’ సినిమాలో నాని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో నాని కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోతాడు. దానికి కారణం తన నటనే. నాని సరసన ఓ సినిమాకి అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. ‘భలే భలే మగాడివోయ్’తో కుదిరింది. ఇప్పుడు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్త హీరోలా నాని ప్రతి సీన్‌నీ చాలా ఎగ్జయిటింగ్‌గా చేస్తాడు. ►నేను టామ్‌బాయ్ టైప్. అందుకని మారుతిగారు నన్ను ‘తమ్ముడూ’ అని పిలుస్తుంటారు. ఆయన అలా పిలిచినప్పుడల్లా లొకేషన్లో అందరూ నవ్వుకునేవాళ్లు. ఆ పిలుపును నేనూ ఎంజాయ్ చేసేదాన్ని. ►‘అందాల రాక్షసి’లో నేను చేసిన మిథున పాత్ర కొంత ప్లస్, కొంత మైనస్ అయ్యింది. ఆ చిత్రంలో హోమ్లీగా కనిపించడంతో నన్ను గ్లామరస్‌గా ఊహించుకోలేపోతున్నారు. ఆ హోమ్లీ ఇమేజ్‌కి భిన్నంగా కూడా కనిపించగలనని నిరూపించు కుంటా. -
గజినిలా మారిపోయిన నాని
-
అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్
‘‘ఈ సినిమాలో హీరోకు మతిమరుపు ఉంటుంది. దాన్ని చాలా అందంగా కవర్ చేసుకుంటాడు హీరో. మానవత్వం ఉన్న క్యారెక్టర్ అతనిది. నాని హీరోగా ఈ సినిమా చేద్దామంటే, మంచి నటుడు కాబట్టి సరేనన్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. నాని, లావణ్యా త్రిపాఠి జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. గోపీసుందర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘నాకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్స్ అంటే గౌరవం. అలాంటి పాత్రలు చేసే నాని అంటే ఇష్టం. అతని కామెడీ టైమింగ్, తెలుగు యాక్సెంట్, సినిమా మీద ఉన్న సెన్సిబిలిటీస్ సూపర్. నా ఫ్రెండ్ మారుతి ఈ సినిమా బాగా తీశాడని అనుకుంటున్నా’’ అన్నారు. నాని మాట్లాడుతూ -‘‘మా దారి ఎంటర్టైన్మెంట్ దారి. రెండు గంటలు హాయిగా నవ్విస్తాం. మారుతీగారు సిద్ధమంటే ‘బీబీఎం2’ కూడా అనౌన్స్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నా ఒరిజినల్ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఈ కథ తయారు చేశాను. మంచి పెర్ఫార్మర్ కావాలనుకున్నప్పుడు నాకు మొదట నాని గుర్తుకు వచ్చాడు’’ అని మారుతి చెప్పారు. చిత్ర కథానాయిక లావణ్యా త్రిపాఠి, దర్శకులు బాబీ, పరశురామ్, నిర్మాతలు శరత్ మరార్, ‘మల్టీ డైమన్షన్’ వాసు, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
భలే.. భలే...వినోదం!
‘‘చక్కటి వినోదం ఉన్న మంచి ప్రేమకథా చిత్రమిది. కచ్చితంగా అందరూ హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి చెప్పారు. ఆయన దర్శకత్వంలో నాని, లావణ్యా త్రిపాఠీ జంటగా జీఏ2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త దృశ్యానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ -‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందించ నున్నారు. శరవేగంగా సినిమా పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేస్తాం’’అని తెలిపారు. నరేష్, స్వప్నమాధురి, సితార, ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిజార్ షఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.