పవన్, మహేష్‌కు స్క్రిప్ట్ రెడీ | Script Ready to the Pawan Kalyan and Mahesh babu | Sakshi
Sakshi News home page

పవన్, మహేష్‌కు స్క్రిప్ట్ రెడీ

Published Sat, Sep 19 2015 12:08 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

పవన్, మహేష్‌కు స్క్రిప్ట్ రెడీ - Sakshi

పవన్, మహేష్‌కు స్క్రిప్ట్ రెడీ

♦ నాని ఈజ్ ఉన్న నటుడు
♦ అటువంటి హీరోతో పని సులువు
♦ ‘భలే భలే మగాడివోయ్’ ఊహించిన విజయమే
♦ ‘సాక్షి’తో దర్శకుడు మారుతి
 
 అడల్ట్ కంటెంట్, డైలాగ్స్‌తో తక్కువ బడ్జెట్‌తో ‘ఈ రోజుల్లో’ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.. తరువాత వచ్చిన యూత్‌ఫుల్ సినిమా ‘బస్టాప్’ కూడా సక్సెస్, ‘ప్రేమకథా చిత్రమ్’ లాంటి హారర్ కామెడీని మొదటి సారి తెరకెక్కించి ట్రెండ్ సృష్టించాడు. ఇప్పుడు తన మార్క్ సినిమాలకు దూరంగా ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  ఆ సినిమా విజయయాత్రలో భాగంగా విశాఖ వచ్చిన డెరైక్టర్ మారుతీతో చిట్‌చాట్.
 - పెదగంట్యాడ
 
 మీ పూర్తి పేరు, ఇతర వివరాలు చాలా మందికి తెలియదనుకుంటా...?
 మారుతీ దాసరి నా పేరు. నేను పుట్టి పెరిగిందంతా మచిలీపట్నం. గ్రాడ్యుయేషన్ చదవడానికి హైదరాబాద్ వెళ్లా. ఎంతో మందిలాగే నాకు సినిమాలంటే పిచ్చి. ఇప్పుడున్న సదుపాయాలేవి అప్పట్లో లేవు.. అయినా సినిమాలకు పనిచేయాలనే పిచ్చి కల. ఈ నేపథ్యంలో కంప్యూటర్, గ్రాఫిక్స్ నేర్చుకొని యానిమేషన్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేశాను.

 చిరంజీవితో పరిచయం ఎలా?
 చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. నా యానిమేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో అల్లు అర్జున్ యానిమేషన్ నేర్చుకున్న సమయంలో ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. చిరంజీవి అప్పట్లో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీకి జెండా రూపక ల్పన చేశాను. ఆ సమయంలో నాలో డెరైక్టర్ ఉన్నాడని మెగాస్టార్ గుర్తించి ప్రోత్సహించారు.

 ‘ఈ రోజుల్లో’ ప్రయోగం ఎలా చేశారు ?
 రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో సినిమా తీయలేదు. ప్రొడ్యూసర్స్‌కి నా టేకింగ్ గురించి అవగాహన ఉంటుందని సీడీ రూపంలోకి మార్చడానికి తీశాను. రామ్‌గోపాల్‌వర్మ అప్పట్లో ‘దొంగల ముఠా’ సినిమాను ఫైవ్‌డి కెమెరాతో తీశారు. ఆయనను అనుసరించి ఫైవ్‌డి కెమెరాతో సినిమా తీశాను.. ఫ్రెండ్స్ చూసి చాలా బాగా వచ్చిందని రిలీజ్ చేద్దామన్నారు. అలా యాదృ  చ్ఛికంగా జరిగిందే తప్ప ‘ఈ రోజుల్లో’ సినిమాతో ఈ స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోలేదు.

 ‘భలేభలే మగాడివోయ్’లో మతి మరుపు క్యారెక్టర్ చేయాలని ఎందుకనిపించింది ?
 అందరికీ మతిమరుపు ఉంటుంది. నేను కూడా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతుంటాను. ఎవరైనా గుర్తు పట్టి ఏంటి సార్.. ఇలా వచ్చారు అంటే మళ్లీ నాలుక్కరుచుకొని ఏదో మేనేజ్ చేసి వెనక్కి వచ్చేస్తుంటాను. అందుకే ఇప్పుడు డ్రైవింగ్ బాధ్యతలు డ్రైవర్‌కి అప్పగించాను. మతిమరుపు డోస్ బాగా పెంచితే లైఫ్ ఎలా ఎంటుందనే ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ సినిమా.

 నాని ఈ సినిమాకి యాప్ట్ అని ఎలా అనుకున్నారు? ఎలా ఒప్పించారు?
 నాని చాలా ఈజ్ ఉన్న నటుడు. ఇప్పటివరకూ ఎవరూ అతన్ని సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ నాలో ఉండేది. మొదట్లో వేరే హీరోతో చేద్దాం అనుకున్నా మైండ్‌లో నుంచి నాని మాత్రం వెళ్లలేదు. సినిమాకి కీలకమైన ఎమోషనల్ సీన్ కోసం రాత్రంతా కష్టపడి అంతా రెడీ చేశాను. నాని వచ్చి క్యాజువల్‌గా ఐదు నిమిషాల్లో టేక్ ఓకే చేసి తర్వాత సీన్ ఏంటి అన్నాడు. ఐదు నిమిషాల్లో ప్యాకప్ చెప్పి అందరినీ ఇంటికి పంపించేశాను. ఇలాంటి ఆర్టిస్ట్ ఉంటే ఖర్చు చాలా తగ్గుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది.
 
 డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా?
 అన్ని రకాల సినిమాలు తీయాలని ఉంది. అలాగే చేస్తూ వచ్చాను. స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబులతో సినిమా చేయాలని ఉంది. వారికి తగ్గ ఎమోషన్స్‌తో స్క్రిప్ట్ కూడా తయారు చేసి ఉంచాను. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

 వైజాగ్‌తో మీ అనుభంధం
 ఎప్పుడు వచ్చినా బీచ్‌లో కూర్చుంటాను. ఇక్కడ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వైజాగ్‌లో ఒక సినిమా తీయాలని ఉంది. ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement