Tollywood: Chiranjeevi Mahesh Babu Allu Arjun Vacation With Family Deets Here - Sakshi
Sakshi News home page

Tollywood Heros: బిజిబిజిగా షెడ్యూల్స్‌..రిలాక్సింగ్‌ కోసం వెకేషన్‌ మోడ్‌లో స్టార్స్‌..!

Published Wed, May 25 2022 12:19 AM | Last Updated on Wed, May 25 2022 8:39 AM

Chiranjeevi Mahesh Babu Allu Arjun Vacation With Family - Sakshi

వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్‌ వంటి వాటితో బిజీ బిజీగా గడిపే స్టార్స్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని రీ చార్జ్‌ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్‌ చేస్తారు. ఇలా రిలాక్స్‌ అవ్వడానికి వెకేషన్‌ మోడ్‌లో ఉన్న హీరోల గురించి ఓ లుక్కేయండి. 

కరోనా అలజడి తర్వాత తొలిసారి విదేశీ  ప్రయాణం చేశారు చిరంజీవి. సతీసమేతంగా అమెరికా, యూరప్‌ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లారు. తన భార్య సురేఖతో కలిసి చాలాకాలం తర్వాత వెకేషన్‌కు వెళ్తున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. ఈ నెల 3న అమెరికా వెళ్లారు చిరంజీవి. ఈ వీకెండ్‌లో వెకేషన్‌ ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంటారని తెలిసింది. వచ్చీ రాగానే ‘గాడ్‌ఫాదర్‌’ షూట్‌లో పాల్గొంటారు చిరంజీవి. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేసిందట చిత్రయూనిట్‌. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్‌’కు తెలుగు రీమేక్‌.

ఇక నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు వెకేషన్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ఏప్రిల్‌ నెలాఖర్లో వెకేషన్‌కు వెళ్లి మే మొదటివారంలో తిరిగొచ్చి ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు మహేశ్‌. ‘సర్కారువారి పాట’ రిలీజ్‌ తర్వాత మళ్లీ ఫ్యామిలీతో కలిసి యూరప్‌ వెళ్లారు. ఈ యూరప్‌ వెకేషన్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌ వచ్చాక  త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని సినిమా షూట్‌లో పాల్గొంటారు మహేశ్‌బాబు. మరోవైపు గత ఏడాది డిసెంబరులో రిలీజైన ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా సక్సెస్‌ను దక్కించుకున్నారు అల్లు అర్జున్‌. దీంతో ‘పుష్ప 2’ కథపై మరింత కసరత్తు ప్రారంభించారు ఈ చిత్రదర్శకుడు సుకుమార్‌. ‘పుష్ప2’ షూటింగ్‌ ఆరంభం కావడానికి సమయం పడుతుంది. ఈలోపు వెకేషన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు అల్లు అర్జున్‌. ఫ్యామిలీతో కలిసి ఆయన లండన్‌ వెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement