
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్‌లో చిరు స్టైల్‌కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా పోటాపోటీగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు చూసేందుకు సినీ అభిమానులే కాకుండా, సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో అభిమానులతో కలిసి ఆయన సినిమాను చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాను మెగాస్టార్‌కి వీరాభిమాని అని అల్లు అర్జున్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Icon StAAr @alluarjun watching his hardcore Mega Star @KChiruTweets fan movie #WaltairVeerayya 😍🔥#AlluArjun #Chiranjeevi #MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/Mg0FPCtdTr
— Nithin (@NithinPSPKCult) January 13, 2023