
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య విజయ విహారం వరంగల్‌లోని హన్మకొండలో నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ వేదికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు.
ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని మేం ఉండం.మేం క్వైట్‌గా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి' అంటూ రామ్‌చరణ్ హెచ్చరించాడు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మరింది. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు సైతం చరణ్ చురకలించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో పనిచేసిన హీరోలందరికి హిట్లు ఇచ్చారని, కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది అంటూ చరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.