రిపోర్ట్‌లో ఏముంది? | Mudra Movie First Look Motion Teaser | Sakshi
Sakshi News home page

రిపోర్ట్‌లో ఏముంది?

Nov 12 2018 2:23 AM | Updated on Nov 12 2018 2:23 AM

Mudra Movie First Look Motion Teaser - Sakshi

నిఖిల్, లావణ్యా త్రిపాఠి

జర్నలిస్ట్‌ అర్జున్‌ ఇన్వెస్టిగేషన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌లోని విషయాలను వెండితెరపై తెలుసుకోవచ్చు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. బి. మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 28న విడుదల కానుంది. జర్నలిస్ట్‌ సురవరం అర్జున్‌ పాత్రలో నిఖిల్‌ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘‘మా సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో మీడియా పాత్రను గుర్తు చేసే సన్నివేశాలు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement