Mudra
-
‘అర్జున్ సురవరం’ వాయిదా పడనుందా!
యువ కథనాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ శ్రీకాంత్ హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు. రిలీజ్ విషయంలోనూ అర్జుణ్ సురవరంకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సినిమాను గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే ఏప్రిల్‌లో రిలీజ్ చేయటం కూడా కష్టమే. ఇప్పటికే ఏప్రిల్ డైరీ ఫుల్ అయి పోయింది. దీంతో మే 1న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట అర్జున్ సురవరం టీం. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘ముద్ర’ కాదు.. ‘అర్జున్ సురవరం’
నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. బి. మధు అర్జున్ సమర్పణలో ఔరా సినిమాస్ పీవీటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ముందుగా ‘ముద్ర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పుడు ఆ టైటిల్‌ను ‘అర్జున్ సురవరం’గా మార్చిన యూనిట్ టైటిల్ లోగో విడుదల చేశారు. ‘‘ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. యూరప్‌లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి 29న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: శ్యామ్ సీఎస్. -
నిఖిల్ మూవీ టైటిల్ మారనుందా?
నిఖిల్ తాజాగా నటిస్తున్న సినిమా టైటిల్‌పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత నట్టి కుమార్, హీరో నిఖిల్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ఈ సినిమా టైటిల్ మారనుందని తెలుస్తోంది. జగపతి బాబు హీరోగా ముద్ర అనే సినిమా కూడా రిలీజ్ కావడం.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నిఖిల్‌ను తన అభిమానులు ప్రశ్నించడం.. ఆ సమయంలో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నిర్మాత నట్టికుమార్ సీరియస్ అవ్వడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మార్చబోతున్నట్లు సమాచారం. కొత్త టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన కణితన్‌కు రీమేకే ఈ చిత్రం. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. -
‘హీరో నిఖిల్ క్షమాపణ చెప్పాలి’
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కొద్ది రోజులుగా ‘ముద్ర ’అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా తన సినిమా లోగో, పేరు వాడుకొని మరో సినిమా విడుదల చేస్తున్నారంటూ నిఖిల్ సోషల్ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే. (‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’) తాజాగా నిఖిల్ కామెంట్లపై నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ముద్ర సినిమా టైటిల్ తనదేనని పునరుద్ఘాటించారు. టైటిల్ తనది అనడానికి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. నిఖిల్ నిర్మాతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టైటిల్ తనది అని నిఖిల్ నిరూపించాలని.. లేకపోతే సినిమాల నుంచి వెళ్లిపోవాలని సవాల్ చేశారు. సినిమా విడుదలయ్యే సమయంలో సినిమా చూడోద్దని నిఖిల్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. చిన్న నిర్మాత అయితే ఏదైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి అని నిలదీశారు.అసభ్యపదజాలంతో నిర్మాతలను తిడతారా అని మండిపడ్డారు. సోమవారంలోపు నిఖిల్ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే ఆయన బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఈ విషయంపై ఎమర్జెన్సీ మీటింట్ పెడుతున్నామని.. అన్ని తేలేవరకూ నిఖిల్ సినిమా ఆపేయాలని డిమాండ్ చేశారు. ముద్ర అనే టైటిల్‌తో జగపతిబాబు ప్రధాన పాత్రలో ఎన్.కె. దర్శకత్వంలో క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ సినిమాను నిర్మించారు. లోగో కూడా నిఖిల్ సినిమాకు చేసినట్లే డిజైన్ చేసారు. దీంతో నిఖిల్ సినిమా అనుకుని జగపతి బాబు సినిమాకు నెటిజన్లు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నిఖిల్ సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. -
‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. తమిళ సినిమా కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వారమే(25-01-2019) రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’మన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. Guys My Movie is NOT RELEASING this week... SOME ppl with evil intentions have used the exact SAME LOGO DESIGN nd put MY NAME in the BOOKINGS APP... My Producers are on the case and will UPDATE u soon with the details.. This is disgraceful 👇 #Mudra pic.twitter.com/2c4IzXaVIV — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 January 2019 -
రిపోర్ట్‌లో ఏముంది?
జర్నలిస్ట్ అర్జున్ ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లోని విషయాలను వెండితెరపై తెలుసుకోవచ్చు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. బి. మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28న విడుదల కానుంది. జర్నలిస్ట్ సురవరం అర్జున్ పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘‘మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో మీడియా పాత్రను గుర్తు చేసే సన్నివేశాలు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. -
నిఖిల్ వెనుకడుగు వేయకతప్పలేదు!
‘కేశవ’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో కాస్త వెనుకపడ్డాడు యంగ్ హీరో నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు తీసి విజయాలు సాధించిన ఈ హీరో గత రెండు సినిమాలతో ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాడు. తాజాగా ఓ తమిళ రీమేక్‌తో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. తమిళ్లో ఘన విజయం సాధించిన కణిథన్ సినిమాను తెలుగులో ‘ముద్ర’ పేరుతో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయాలని భావించారు. కానీ నవంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లపై దాడి చేయనున్నాయి. విజయ్ ‘సర్కార్’, ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ దీపావళి కానుకగాకే విడుదల కానుండగా.. రజనీకాంత్ 2.ఓ నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ తన ‘ముద్ర’ను డిసెంబర్లో వేయబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
నిఖిల్ ‘ముద్ర’ వస్తోంది
‘కిరాక్ పార్టీ’ మూవీ తరువాత నిఖిల్ హీరోగా వస్తోన్న చిత్రం ‘ముద్ర’. తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఠాగుర్ మధు నిర్మిస్తున్నారు. -
‘ముద్ర’ మూవీ స్టిల్స్
-
‘నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించాం’
సాక్షి, న్యూఢిల్లీ : 30 వేల రూపాయల పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించదు అంటూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. సబర్మతి నది తీరాన ఉన్న పార్క్‌లో ‘ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్’ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గిరిరాజ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ‘ఈ నాలుగేళ్ల పాలనలో మేము 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. వారిలో దాదాపు 70శాతం మంది నెల జీతం 12 వేల రూపాయలు. ప్రస్తుతం ప్రపంచం నైపుణ్యాలు కలిగిన యువత కోసం చూస్తుంది. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువత కేవలం 5 శాతం మాత్రమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ గురించి తొలిసారి బీజేపీ ప్రభుత్వమే మాట్లాడింది. 30 వేల రూపాయల విలువ చేసే పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం లభించే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించకపోవడంలో వింతేముంది’ అన్నారు. ‘ముద్రా’ పథకం కింద తమ మంత్రిత్వ శాఖ 10 కోట్ల మందికి ఉపాధి కల్పించిందన్నారు. 2010 - 2014 మధ్య కాలంలో యూపీఏ హయాంలో 11 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలను తయారుచేశామని తెలిపారు. టెక్స్టైల్, హస్త కళల పరిశ్రమలను మినహాయించి ఇంతమంది పారిశ్రామికవేత్తలను తయారు చేసామన్నారు. ఇక ఆ రెండు శాఖలను కూడా కలుపుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మహాత్మగాంధీ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన విధానాలను ఖూనీ చేసిందని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా చరఖా గురించి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. సబర్మాతి నదీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా స్టీల్ చరఖాను ఆవిష్కరించారు. -
న్యూస్ ఏంటి?
‘కిరాక్ పార్టీ’ వంటి హిట్ చిత్రం తర్వాత నిఖిల్ నటిస్తోన్న తాజా సినిమా ‘ముద్ర’. లావణ్యా త్రిపాఠి కథానాయిక. టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్లపై కార్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా ‘ముద్ర’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో నిఖిల్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్‌లో తన చేతిలో కెమెరాతో కనిపించారు నిఖిల్. జర్నలిజమ్‌లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారట. న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ‘‘మా సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ‘ఠాగూర్’ మధు, సంగీతం: శ్యామ్ సి.ఎస్, కెమెరా: సూర్య. -
నిఖిల్ ‘ముద్ర’ ఫస్ట్ లుక్
ఈ ఏడాది ‘కిరాక్ పార్టీ’ అంటూ యంగ్ హీరో నిఖిల్ ప్రేక్షకులను పలకరించాడు. అది ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయే సరికి తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు ఈ కుర్రహీరో. నిఖిల్ ప్రస్తుతం.. తమిళ్లో విజయం సాధించిన కనితన్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నిఖిల్ నటిస్తోన్న 16వ చిత్రం ‘ముద్ర’ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీ.యన్. సంతోష్ దర్శకత్వంలో ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. Let us BREAK THE BREAKING NEWS... My 16th film MUDRA First Look.. Playing Arjun Lenin Suravaram... The Pen/Camera is Mightier than the Gun @Itslavanya @tnsanthosh @auraacinemas @MovieDynamix . Presented by @TagoreMadhu #NIkhil16 #HBDNikhil #MudraFirstLook #Mudra pic.twitter.com/YXEcnYGAkt — Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2018