నిఖిల్‌ ‘ముద్ర’ ఫస్ట్‌ లుక్‌ | Nikhil Starring Mudra Movie First look Out | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 1 2018 8:12 PM | Last Updated on Fri, Jun 1 2018 9:09 PM

Nikhil Starring Mudra Movie First look Out - Sakshi

ఈ ఏడాది ‘కిరాక్‌ పార్టీ’ అంటూ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రేక్షకులను పలకరించాడు. అది ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయే సరికి తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు ఈ కుర్రహీరో. నిఖిల్‌ ప్రస్తుతం.. తమిళ్‌లో విజయం సాధించిన కనితన్‌ మూవీని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

శుక్రవారం నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌. నిఖిల్‌ నటిస్తోన్న 16వ చిత్రం ‘ముద్ర’ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీ.యన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement