‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’ | Hero Nikhil Siddhartha Clarity On Mudra Release | Sakshi
Sakshi News home page

Jan 24 2019 3:32 PM | Updated on Jan 24 2019 3:32 PM

Hero Nikhil Siddhartha Clarity On Mudra Release - Sakshi

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. తమిళ సినిమా కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న  ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వారమే(25-01-2019) రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్‌ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్‌ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’మన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement