Nikhil Spy Movies Release Date Issue - Sakshi
Sakshi News home page

Nikhil SPY Movie: 'స్పై' మూవీ రిలీజ్.. అసలేంటి గొడవ?

Published Sun, Jun 18 2023 12:05 PM | Last Updated on Sun, Jun 18 2023 12:52 PM

Nikhil Spy Movie Release Date Issue - Sakshi

ప్రస్తుతం ఎక్కడచూసినా 'ఆదిపురుష్' హడావుడి నడుస్తోంది. టాలీవుడ్ లో మాత్రం 'స్పై' మూవీ రిలీజ్ విషయంలో హీరో-నిర్మాత మధ్య గొడవ జరుగుతోందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కానీ హీరోగా నటించిన నిఖిల్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో ఏం జరుగుతుందా అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ అసలేంటి గొడవ?

'హ‍్యాపీడేస్'తో నటుడిగా మారిన నిఖిల్.. అప్పటి నుంచి పలు సినిమాలు చేస్తూ వచ్చాడు. కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగులో ఏ యంగ్ హీరోకి సాధ్యం కాని విధంగా 'స్వయంభు', 'ద ఇండియా హౌస్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!)

వీటికంటే ముందు 'స్పై' మూవీ చేశాడు. కొన్నాళ్ల ముందు టీజర్ రిలీజ్ చేయగా ఆలోవర్ ఇండియా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ జూన్ 29న ఈ సినిమాని రిలీజ్ చేద్దామని నిర్మాత భావిస్తుంటే.. హీరో నిఖిల్ మాత్రం డేట్ వాయిదా వేద్దామని, దేశం మొత్తం ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేద్దామని అడిగారట. దానికి నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదని టాక్. ఇప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక.. దాన్ని మార్చితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'స్పై' రిలీజ్ డేట్ విషయంలో మార‍్పు లేదని క్లారిటీ ఇస్తూ మరోసారి పోస్టర్స్ విడుదల చేశారు. వీటిని హీరో నిఖిల్ ఎక్కడా ప్రమోట్ చేయలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ఈ గొడవ ఇంకా క్లియర్ కాలేదా అని డౌట్ వస్తుంది. మరి నిర్మాత చెప్పినట్లు జూన్ 29నే ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా? లేదా వాయిదా పడుతుందా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement