Nikhil Says He Cried About Karthikeya 2 Movie Release Problems: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. 'హ్యాపీ డేస్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్‌కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం వినూత్నంగా కాంటెస్ట్‌లు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చాను అని తెలిపాడు నిఖిల్. ''ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగింది. నిజం చెప్పాలంటే ఒక ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు.. అది కూడా వద్దని చెప్పారు.
చదవండి: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ కాంటెస్ట్.. గెలిస్తే రూ. 6 లక్షలు
ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్
అక్టోబర్‌కు వెళ్లిపోండి. నవంబర్‌కు వెళ్లిపోండి. ఇప్పుడు అప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వము. అన్న స్టేజ్ వరకు వెళ్లింది. అప్పుడు నేను ఏడ్చాను. నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్‌ను. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. నువ్ ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది. చివరికీ మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్‌తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నాం అని ప్రకటించాం'' అని నిఖిల్ పేర్కొన్నాడు.
చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment