‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంది సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. లవ్ ప్రపోజల్ సీన్ రాయడానికి నాలుగు రోజులు పట్టింది’’ అని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణ చైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ గత శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. అందర్నీ నవ్విస్తూ అక్కడక్కడా ఏడిపించాను. రామ్ పాత్ర అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతోంది. అనుపమ, లావణ్య పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి’’ అన్నారు. ‘‘మా సినిమా యువతకు దగ్గరవుతుందనుకున్నాం. అయితే యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది.
అన్ని వర్గాలు ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. మా పాత్రలు గుర్తుండిపోతాయి. నిర్మాతలు కూడా హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు రామ్. ‘‘మరికొన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావడానికి మా సినిమా దారి చూపినట్లయింది. ఎమోషనల్ సీన్స్‌లో నేను, డైరెక్టర్ ఏడ్చిన సందర్భాలున్నాయి’’ అని నటుడు శ్రీవిష్ణు అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్, కృష్ణచైతన్య, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి, శ్రీమణి, కిరిటీ, చంద్రబోస్, ప్రియదర్శి, ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment