
అనుపమా పరమేశ్వరన్, రామ్
ట్రైన్‌లో కూర్చుని ఫ్యాన్ గాలితో కూల్ అవుతున్నారు కథానాయిక అనుపమా పరమేశ్వరన్. ఆమె ఎక్కడికైనా వెళ్తున్నారా? లేక ఎక్కడినుంచైనా వస్తున్నారా? అని అడక్కండి. ఆ విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ డీటైల్స్‌ని సినిమాలో కలెక్ట్ చేసుకోండి. రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇందులో అనుపమా పరమేశ్వర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ప్రణీత మరో కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ట్రైన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్‌లో హీరో రామ్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి.
Comments
Please login to add a commentAdd a comment