దూసుకెళ్తోన్న ‘హలో గురు ప్రేమకోసమే’ ట్రైలర్‌ | Ram Hello Guru Prema Kosame Trailer Goes Viral | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 11:01 AM | Last Updated on Fri, Oct 12 2018 11:01 AM

Ram Hello Guru Prema Kosame Trailer Goes Viral - Sakshi

రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌ మరో మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాతో తొలిసారి జోడి కట్టి ప్రేక్షకులను పలకరించారు. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వీరి జోడి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. అందుకే వీరు మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమయ్యారు. 

త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్‌లో రాబోతోన్న హలో గురు ప్రేమకోసమే.. సినిమాలో రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌ మూడు మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న థియేటర్లలో సందడిచేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement