Vunnadi okate zindagi
-
అందరూ కనెక్ట్ అవుతున్నారు
‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంది సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. లవ్ ప్రపోజల్ సీన్ రాయడానికి నాలుగు రోజులు పట్టింది’’ అని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణ చైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. అందర్నీ నవ్విస్తూ అక్కడక్కడా ఏడిపించాను. రామ్ పాత్ర అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతోంది. అనుపమ, లావణ్య పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి’’ అన్నారు. ‘‘మా సినిమా యువతకు దగ్గరవుతుందనుకున్నాం. అయితే యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అన్ని వర్గాలు ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. మా పాత్రలు గుర్తుండిపోతాయి. నిర్మాతలు కూడా హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు రామ్. ‘‘మరికొన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావడానికి మా సినిమా దారి చూపినట్లయింది. ఎమోషనల్ సీన్స్‌లో నేను, డైరెక్టర్ ఏడ్చిన సందర్భాలున్నాయి’’ అని నటుడు శ్రీవిష్ణు అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్, కృష్ణచైతన్య, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి, శ్రీమణి, కిరిటీ, చంద్రబోస్, ప్రియదర్శి, ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు. -
'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ
టైటిల్ : ఉన్నది ఒకటే జిందగీ జానర్ : ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిశోర్ తిరుమల నిర్మాత : స్రవంతి రవికిశోర్ నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు. అందుకే తన కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యతను మరోసారి దర్శకుడు కిశోర్ తిరుమల చేతిలో పెట్టాడు. తొలి సినిమాలో కేవలం ప్రేమ కథ మీదే ఫోకస్ పెట్టిన రామ్, కిశోర్ లు ఉన్నది ఒకటే జిందగీలో లవ్ తో పాటు స్నేహబంధాన్ని కూడా అదే స్థాయిలో చూపించారు. మరి రామ్ నమ్మకాన్ని కిశోర్ నిలబెట్టుకున్నాడా..? ఈ ఇద్దరి కాంబినేషన్ నేను శైలజ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా..? కథ : అభి (రామ్ పోతినేని) స్నేహమంటే ప్రాణమిచ్చే కుర్రాడు. స్కూల్ లో తన తో పాటు చదువుకునే వాసు (శ్రీ విష్ణు) అంటే అభికి ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చిన అభి ఊరుకోడు. అంతేకాదు ఆరేళ్ల వయసులోనే మంచి స్కూల్ లో సీటు వచ్చినా.. వాసు కోసం వదులుకుంటాడు అభి. వారి వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగి పెద్దదవుతుంది. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా ఇష్టం, సొంతంగా ఓ రాక్ బ్యాండ్ ను తయారు చేసుకోని కన్సర్ట్ లు ఇస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) హ్యాపిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. మహాకు కూడా సంగీతం అంటే ఇష్టముండటంతో పాటు అభి తన కుటుంబ సమస్యల విషయంలో ధైర్యం చెప్పటంతో మహా, అభిలు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ అదే సమయంలో వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. వాసు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాకే వ్యాల్యూ ఇస్తుండటంతో కోపంతో అభి, వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. ప్రాణమైన ఫ్రెండ్ ను కాదని అభి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు..? అభి, వాసు తిరిగి కలుసుకున్నారా..? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి)కి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నేను శైలజ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న రామ్, ఈసినిమాలో తన మార్క్ ఎనర్జీని కూడా చూపించాడు. ముఖ్యంగా రాక్ స్టార్ లుక్ లో రామ్ బాడీ లాంగ్వేజ్, పర్పామెన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో రామ్ నటన కంటతడి పెట్టిస్తుంది. వాసు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు.(సాక్షి రివ్యూస్) అనుపమా పరమేశ్వరన్ అందంగా హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ లో మేఘనగా లావణ్య త్రిపాఠి నటన బబ్లీ బబ్లీగా అలరించింది. గ్లామర్ షోతోనూ లావణ్య మంచి మార్కులు సాధించింది. ఫ్రెండ్స్ గా నటించిన ప్రియదర్శి ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నేను శైలజ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కిశోర్ తిరుమల మరోసారి అదే బాధ్యతను తీసుకొని ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు. ప్రేమ, స్నేహంల మధ్య కిశోర్ రాసుకున్న కథ మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. కానీ తొలి భాగం మరింత వేగంగా కథ నడించి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకుండా ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో అన్ని మరిచిపోయేలా అందమైన ముగింపునిచ్చి అలరించాడు దర్శకుడు.(సాక్షి రివ్యూస్) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఇప్పటికే సూపర్ హిట్ అయిన వాట్ అమ్మా, ట్రెండ్ మారినా పాటలు వెండితెర మీద మరింతగా అలరించాయి. ఎమోషనల్ సీన్స్ కు దేవీ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరికాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఉన్నది ఒకటే జిందగీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
మగాడు కూడా మదర్ అవ్వొచ్చు.. – కిశోర్ తిరుమల
‘‘జనరల్‌గా నేను రాత్రి 9 గంటల తర్వాత ఎవరికీ ఫోన్ చేయను. వెరీ ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేస్తా. కానీ, ‘వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా’ పాట కోసం అర్ధరాత్రి 12:30, 1గంట అయినా నా డీసెన్సీని పక్కన పెట్టి, శ్రీమణికి ఫోన్ చేసి మాట్లాడేవాణ్ణి’’ అని హీరో రామ్ అన్నారు. రామ్, లావణ్యా త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్లో చాలా మాట్లాడేశా. కానీ, నలుగురు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడటం మరచిపోయా. అందుకు పాటల రచయితలు చంద్రబోస్‌గారు, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌గారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గారికి సారీ. సినిమా మాకూ చాలాఫ్రెష్గా అనిపిస్తోంది. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో బాగా సక్సెస్ అయింది. చాలామంది ఫోన్ చేసి, పాటలు బాగున్నాయని చెబుతుండటం రియల్ సక్సెస్’’ అన్నారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా మిక్సింగ్‌లో చూస్తున్నప్పుడు.. కొన్ని సీన్స్ చూస్తే అది హ్యాపీనెస్సా? ఎగై్జట్మెంటా? అన్నది తెలియలేదు. ప్రీ–క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఆ సన్నివేశం, మ్యూజిక్ చూస్తుంటే నాకు తెలియకుండా చేతులు వణికాయి. నాకా టైమ్‌లో అనిపించింది. మామూలుగా జన్మనిచ్చే అదృష్టం ఆ భగవంతుడు మహిళలకి ఇస్తారు. ఒక మంచి సినిమా తీస్తే మనం కూడా జన్మనివ్వొచ్చు. మగాడు కూడా మదర్ అవ్వొచ్చనిపించింది’’ అన్నారు. ‘‘చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాం. యూనిట్ అంతా సంతోషంగా ఉంది. మీ (ప్రేక్షకులు) ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘నా కెరీర్లో మరచిపోలేని మ్యాగీ పాత్రను ఇందులో చేశా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్రవంతి రవికిశోర్ సార్‌కి థ్యాంక్స్. షూటింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉండేది’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘23 ఏళ్ల నిరీక్షణ తర్వాత స్రవంతి బ్యానర్లో పాటలు రాసే అవకాశం వచ్చింది’’ అన్నారు చంద్రబోస్. ‘స్రవంతి’ రవికిశోర్, పాటల రచయిత కృష్ణచైతన్య, నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, కెమెరామేన్ సమీర్ పాల్గొన్నారు. -
కన్విన్స్ అవుతా... లేకపోతే కన్విన్స్ చేస్తా!
‘‘స్క్రిప్ట్ వినాలనుకున్నప్పుడు ఓపెన్ మైండ్‌తో వెళతాను. సినిమా చూస్తున్నట్లు ఇంట్రెస్ట్‌గా స్క్రిప్ట్ నెరేషన్‌ను ఎగ్జామిన్ చేస్తాను. ఎగై్జటింగ్‌గా ఉందనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తా. క«థ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలు ఓకే’’ అన్నారు హీరో రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చెప్పిన విశేషాలు... ‘ఒకటే జిందగీ’ కహానీ ఏంటి? చైల్డ్‌హుడ్, కాలేజ్ అండ్ మెచ్యురిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత... ఇలా అభిరామ్ (రామ్ పాత్ర పేరు) క్యారెక్టర్లో త్రీ ఫేజెస్ ఉంటాయి. బేసికల్లీ ఫ్రెండ్షిప్ ఫిల్మ్. ఇందులో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీలు ఉంటాయి. చైల్డ్‌హుడ్ నుంచి అభిరామ్‌కి, వాసుకి ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగుతుంది? వారితో ఎవరు జాయిన్ అవుతారు? ఎవరు విడిపోతారు? వాళ్ల వల్ల అభిరామ్‌కి, వాసుకి ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయా? అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు అభిరామ్‌లా ఓ ఫ్రెండ్ ఉంటే చాలురా ఈ లైఫ్‌కి అన్నట్లు ఉంటుంది. మాస్ కమర్షియల్ టైప్ సినిమా కాదిది. ఐటమ్‌సాంగ్ కూడా లేదు. హ్యూమన్ ఎమోషన్స్‌కు రెస్పాండ్ అయ్యే అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమా చేసేటప్పుడు మీ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారా? సినిమా ప్రీ–ప్రొడక్షన్ నా రియల్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్ శరత్ గుర్తొచ్చాడు. అతను చెన్నైలో ఉంటాడు. నేను, డైరెక్టర్ కిశోర్ మా అనుభవాలను చర్చించుకునేవాళ్లం. అందులో ఏవైనా మంచి ఫీల్‌గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే ‘ఈ సీన్‌ను సినిమాలో ట్రై చేద్దామా’? అని కిశోర్ అనేవాడు. న్యూ లుక్ ట్రై చేశారు కదా... దాని గురించి? నేను స్క్రిప్ట్ వినకముందు నుంచే జుట్టు, గడ్డం పెంచుకున్నాను. ఏదైనా కొత్త లుక్‌లో స్క్రీన్‌పై కనిపించాలనుకున్నాను. నేను, కిశోర్ స్టోరీ గురించి డిస్కస్ చేశాం. అప్పుడు గిటార్ బ్యాండ్ కాన్సెప్ట్ అనుకున్నాం. గిటార్ ప్లేయర్స్ లుక్ కోసం ఇలా మేకోవర్ అయ్యాను. వాళ్లు జుట్టు, గడ్డం పెంచుకుని ఉంటారు. టాటూస్ కూడా వేసుకుంటారు. అవి మనవాళ్లకి వర్కౌట్ అవ్వవు కదా అని టాటూస్ వేయించుకోలేదు. ‘నేను.. శైలజ’లో చేసిన హరి క్యారెక్టరైజేషన్‌కి, ఈ సినిమాలో అభిరామ్ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అభిరామ్ క్యారెక్టర్ రోల్ మోడల్లా ఉంటుంది. లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోకుండా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. సినిమా చూస్తే అర్థం అవుతుంది. లైఫ్ అంటే సింపుల్ కాదని హీరోయిన్ అంటుంది. కానీ, అభిరామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తన కన్విన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నేను అభిరామ్‌లా ఉండాలని ట్రై చేస్తుంటాను. దేవీశ్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ ట్యూన్స్‌కి మీ ఎనర్జీ బాగా కనెక్ట్ అయినట్లుంది? తను నాతో ఐదు సినిమాలు చేశాడు. మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. మేం ఎప్పుడు కలిసినా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. రీ–రికార్డింగ్ చేస్తున్నప్పుడు ‘సీన్ అదిరిపోయిందబ్బా..’ అని ఫోన్ చేస్తాడు. సాంగ్ సిచ్యువేషన్∙చెప్తే చాలు.. దేవి ట్యూన్ కట్టేస్తాడు. ఇన్పుట్స్ వెంటనే రెడీ చేసుకుంటాడు. తన బీట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హైపర్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని, ఈ సినిమా చేశారు? గ్యాప్ తీసుకోవాలని కాదు. నిజానికి ‘హైపర్’కి ముందు కూడా గ్యాప్ తీసుకున్నాను. స్క్రిప్ట్ నచ్చితే వెంటనే స్టార్ట్ చేసేస్తాను. ‘నేను.. శైలజ’, ‘శివమ్’, ‘పండగ చేస్కో’ ఒకేసారి విన్నా... ఒకే సారి ఒకే చేశా. స్క్రిప్ట్ ఎగై్జట్ చేస్తే.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తా. n అనిల్ రావిపూడి చెప్పిన కథ (బ్లైండ్ క్యారెక్టర్‌తో) ఒప్పుకోలేదట! ఎందుకు? కొన్ని కుదర్లేదంతే! అంతకు మించి ఏం లేదు. వద్దనుకున్న స్క్రిప్ట్ గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తారా? వన్స్ స్క్రిప్ట్‌ను రిజెక్ట్ చేసిన తర్వాత మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు. మీ లైఫ్‌లో మీ పెదనాన్నగారి రోల్ గురించి ఏం చెప్తారు? దానికి పర్టిక్యూలర్ ఆన్సర్ అంటూ ఏం లేదు. ఆయన త్రూ అవుట్ ఉన్నారు. కథ గురించి, క్యారెక్టరైజేషన్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటాం. నాతో సినిమా తీయడం అనేది ఆయనకు పెద్ద డీల్ కాదు. ఒకవేళ కాదనుకుంటే... వేరే నిర్మాత వచ్చి తీస్తారు. నా కెరీర్ మొత్తం ఆయన ఉన్నారు. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం. కథ ఎంపిక విషయంలో నాదే ఫైనల్ డెసిషన్. ఒకటి నేను కన్విన్స్ అవుతా. లేదా అవతలి వారిని కన్విన్స్ చేస్తాను. ప్రతి సినిమాను నమ్మే చేస్తాం. మీరు హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఫెయిల్ అయితే మీ రియాక్షన్... ఆ ఫెయిల్యూర్‌ను ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. మంచి రిజల్ట్ రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఎనలైజ్ చేసుకుంటాను. బట్.. ఫైనల్‌గా బయటపడతాను. ‘జగడం’ సినిమా గుడ్ రిజల్ట్ ఇవ్వలేదని బాధ పడ్డాను. ‘ఎందుకు నచ్చలేదు. బాగుంది కదా’ అనుకున్నా. ‘ఎందుకంటే ప్రేమంట..’ సినిమాకు కూడా అలానే ఫీలయ్యాను. అన్ని సినిమాలను కాన్ఫిడెంట్‌గానే చేస్తాం. లేకపోతే అంత ఖర్చు పెట్టి సినిమాలు తీయలేం. వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవాలన్న ప్లాన్ ఏమైనా? మైండ్‌లో ఉంది. బట్ బైలింగువల్ అంత ఈజీ కాదు. మీడియా ముందుకు రాని చాలా ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్ చేశాను కూడా. తమిళ్‌కి, తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడి ఎమోషన్ వేరు. ఇక్కడి ఎమోషన్ వేరని నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగాను. నెక్ట్స్ ఏ సినిమాలు చేస్తున్నారు. ‘రెడీ’కి సీక్వెల్ చేస్తున్నారట.. ‘రెడీ’ సిన్మాకి సీక్వెల్ లేదు. వేరే స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. -
'ఉన్నది ఒక్కటే జిందగీ' మూవీ స్టిల్స్