‘‘జనరల్‌గా నేను రాత్రి 9 గంటల తర్వాత ఎవరికీ ఫోన్ చేయను. వెరీ ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేస్తా. కానీ, ‘వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా’ పాట కోసం అర్ధరాత్రి 12:30, 1గంట అయినా నా డీసెన్సీని పక్కన పెట్టి, శ్రీమణికి ఫోన్ చేసి మాట్లాడేవాణ్ణి’’ అని హీరో రామ్ అన్నారు.
రామ్, లావణ్యా త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్‌లో చాలా మాట్లాడేశా. కానీ, నలుగురు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడటం మరచిపోయా.
అందుకు పాటల రచయితలు చంద్రబోస్‌గారు, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌గారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గారికి సారీ. సినిమా మాకూ చాలాఫ్రెష్‌గా అనిపిస్తోంది. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో బాగా సక్సెస్ అయింది. చాలామంది ఫోన్ చేసి, పాటలు బాగున్నాయని చెబుతుండటం రియల్ సక్సెస్’’ అన్నారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా మిక్సింగ్‌లో చూస్తున్నప్పుడు.. కొన్ని సీన్స్ చూస్తే అది హ్యాపీనెస్సా? ఎగై్జట్‌మెంటా? అన్నది తెలియలేదు.
ప్రీ–క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఆ సన్నివేశం, మ్యూజిక్ చూస్తుంటే నాకు తెలియకుండా చేతులు వణికాయి. నాకా టైమ్‌లో అనిపించింది. మామూలుగా జన్మనిచ్చే అదృష్టం ఆ భగవంతుడు మహిళలకి ఇస్తారు. ఒక మంచి సినిమా తీస్తే మనం కూడా జన్మనివ్వొచ్చు. మగాడు కూడా మదర్ అవ్వొచ్చనిపించింది’’ అన్నారు. ‘‘చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాం. యూనిట్ అంతా సంతోషంగా ఉంది. మీ (ప్రేక్షకులు) ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్.
‘‘నా కెరీర్‌లో మరచిపోలేని మ్యాగీ పాత్రను ఇందులో చేశా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్రవంతి రవికిశోర్ సార్‌కి థ్యాంక్స్. షూటింగ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉండేది’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘23 ఏళ్ల నిరీక్షణ తర్వాత స్రవంతి బ్యానర్‌లో పాటలు రాసే అవకాశం వచ్చింది’’ అన్నారు చంద్రబోస్. ‘స్రవంతి’ రవికిశోర్, పాటల రచయిత కృష్ణచైతన్య, నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, కెమెరామేన్ సమీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment