‘‘నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. మా కుటుంబంలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. కానీ, నాకు నటనంటే ఇష్టం. ఎలాగైనా నటి కావాలని ప్రయత్నించా. నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. రామ్, అనుపమ, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో మహా పాత్రలో అలరించిన అనుపమ చెప్పిన విశేషాలు...
► కిశోర్‌గారు చెప్పిన కథ నచ్చింది. నా పాత్ర చనిపోతుందని చెప్పడంతో ముందు జోక్ అనుకున్నా. కానీ, ఆయన నన్ను కన్విన్స్ చేయడం... మంచి పాత్ర కావడంతో ఓకే చెప్పేశా. ఇప్పుడందరూ నా పాత్ర గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గర్వంగా ఉంది.
► ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో మహా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంది. నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి, సినిమాలో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. మహా పాత్ర చాలా బాగుందని నా గత చిత్రాల దర్శకులు, నా సోషల్ మీడియా ఫాలోయర్లు అభినందిస్తుంటే ఫుల్ హ్యాపీ. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పా. ఎమోషన్ సన్నివేశాల కోసం గ్లిజరిన్ బాగా వాడాల్సి వచ్చింది.
► కథే సినిమాకు హీరో. కథ బాగుంటే సినిమా చెయ్యడానికి అంగీకరిస్తాను. అలాగే, నా పాత్ర గురించీ ఆలోచిస్తా. అవసరమైతే గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధం. కానీ, నా పాత్ర పట్ల డైరెక్టర్ పూర్తి క్లారిటీగా ఉండి, నన్ను కన్విన్స్ చేయాలి. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కంటే షూటింగ్‌లో ఎక్కువ ఎంజాయ్ చేసా. రామ్‌తో పనిచేయడం సరదాగా అనిపించింది.
► టాలీవుడ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా, హీరో శర్వానంద్ నా బెస్ట్ ఫ్రెండ్. సాయిపల్లవితో తరచూ మాట్లాడుతుంటా. మరికొంత మంది కథానాయికలతోనూ టచ్‌లో ఉంటున్నా.
► మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నానీతో, కరుణాకరన్ డైరెక్షన్‌లో సాయి ధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment