హలో గురు ప్రేమ కోసమే | Ram Pothineni begins ‘Hello Guru Prema Kosame’ shoot with title logo launch | Sakshi
Sakshi News home page

హలో గురు ప్రేమ కోసమే

Published Fri, Mar 9 2018 5:18 AM | Last Updated on Fri, Mar 9 2018 5:18 AM

Ram Pothineni begins ‘Hello Guru Prema Kosame’ shoot with title logo launch - Sakshi

త్రినాథరావు, అనుపమా పరమేశ్వరన్, రామ్, ‘దిల్‌’ రాజు, శిరీష్‌

లైఫ్‌లో లవ్‌ పార్ట్‌ సెపరేట్‌ గురూ! ఆ మజానే వేరు. అందుకే ప్రేమ కోసం ఎంత దాకా అయినా వెళ్లాలి. ఏం చేయడానికైనా తెగించాలి అంటున్నారు హీరో రామ్‌. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌ చదవగానే ‘హలో గురూ ప్రేమకోసమే రోయ్‌ జీవితం..’ అని ‘నిర్ణయం’లో నాగార్జున సందడి చేసిన పాట గుర్తొస్తోంది కదూ.

ఆ సంగతలా ఉంచితే.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తర్వాత మరోసారి రామ్‌కు జంటగా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాతలు ఎర్నేని నవీన్, ‘స్రవంతి’ రవికిషోర్‌ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 12న స్టార్ట్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు’’ అని చిత్రబృందం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ కె.చక్రవర్తి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement