
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కదిలే కాలాన్ని అడిగా..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ, లావణ్య ఉన్న ఓ పోస్టర్‌తో ప్రకటించారు.
కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘చావు కబురు చల్లగా’ చిత్రం టైటిల్, కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ వీడియో, లావణ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్, మైనేమ్ ఈజ్ రాజు.. అనే పాటకు అనూహ్య స్పందన లభించింది. మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కరమ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ కరుటూరి, శరత్ చంద్ర నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment