విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన | Lavanya Tripathi And Miss Perfect Team Will Come To Vizag | Sakshi
Sakshi News home page

విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన

Published Fri, Jan 26 2024 8:32 PM | Last Updated on Sat, Jan 27 2024 9:14 AM

Lavanya Tripathi And Miss Perfect Team Will Came To Vizag - Sakshi

జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్‌ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్​ పర్​ఫెక్ట్' టీమ్‌. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్‌నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్​ పర్​ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.  ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్‌ ప్రకటించారు.

'మిస్​ పర్​ఫెక్ట్' వెబ్‌ సిరీస్‌లో  లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్‌లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది.  అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్‌. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్‌లా ఉంటుంది. క్లీన్‌నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్‌ సిరీస్‌ను ,అందరినీ ఆకట్టుకుంటుందని  డిస్నీ+ హాట్‌స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ  'మిస్​ పర్​ఫెక్ట్'  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 

ఇందులో లవ్‌ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్‌గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది.  పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్‌ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది.  లావణ్యతో పాటు అభిజిత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement