Abhijith
-
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్‌గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. -
విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన
జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్ పర్ఫెక్ట్' టీమ్. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్‌నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్ ప్రకటించారు. 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్‌లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్‌లా ఉంటుంది. క్లీన్‌నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ,అందరినీ ఆకట్టుకుంటుందని డిస్నీ+ హాట్‌స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ 'మిస్ పర్ఫెక్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్‌గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది. పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది. లావణ్యతో పాటు అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. -
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్‌లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్‌లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్‌మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కాగా, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ ఆయిల్ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు) -
ఫేమస్ డాన్సర్ ఆత్మహత్య
పలు సూపర్‌హిట్ బాలీవుడ్ చిత్రాల్లో డాన్సర్‌గా కనిపించిన ఫేమస్ డాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని అభిజిత్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అభిజిత్ మృతదేశం వద్ద లభించిన సూసైడ్ నోట్లో తన బ్యాంక్ అకౌంట్‌ను కుమార్తెకు ట్రాన్స్పర్ చేయమని కొరినట్టుగా పోలీసులు తెలిపారు. కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అభిజిత్ షిండే డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోలు రణవీర్, రణ్‌బీర్‌లతో పలు సూపర్ హిట్ పాటల్లో డాన్స్ చేశాడు అభిజిత్ షిండే. -
న్యూజిలాండ్ ప్రేమకథ
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ అభిజిత్ హీరోగా తెరకెక్కనున్న ‘7 అడుగులు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. న్యూజిలాండ్‌లో పలు మ్యూజిక్ ఆల్బమ్స్, యాడ్ ఫిలింస్ రూపొందించిన సంతోష్ తుక్కాపురం ఈ చిత్రానికి దర్శకుడు. మోక్ష మూవీస్ పతాకంపై తాన్యా ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రా నిర్మిస్తున్నారు. తెలంగాణ ఎంపీ కవిత ‘7 అడుగులు’ టైటిల్ లోగో ఆవిష్కరించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన కథతో సాగే చిత్రమిది. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో మన సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నాం. న్యూజిలాండ్‌లో మొత్తం షూటింగ్ జరుపుకోనున్న తొలి సినిమా మాదే. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, నవంబర్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇదొక న్యూజిలాండ్ బేస్డ్ మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ’’ అన్నారు సంతోష్. ‘‘ఈ సినిమా నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అంత పేరు తెస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు అభిజిత్. సంగీత దర్శకుడు కె.ఎమ్. రాధాకృష్ణ, కెమెరామేన్ ధీరజ్ తమ్మినేని తదితరులు పాల్గొన్నారు. -
ఘాటుగా...
ఆ కుర్రాడు చాలా యాక్టివ్. సరదా సరదాగా ఉంటాడు. కానీ, ఎవరైనా కానిపని చేశారో చెలరేగిపోతాడు. మిర్చిలోని ఘాటుతో ఈ కుర్రాడి దమ్మూ, ధైర్యాన్ని పోల్చవచ్చు. ఈ కుర్రాడి కథ ఏంటి? సరదాగా ఎంజాయ్ చేసే వయసులో మిర్చి స్థాయిలో ఎందుకు చెలరేగాల్సి వచ్చిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించిన చిత్రం ఇది. జయనాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న యూత్‌ఫుల్ మూవీ ఇది. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ అద్భుతంగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉండే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
రియల్ స్టోరీ!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. జె. కరుణకుమార్ దర్శకుడు. ఎ.మోహన్‌నాయుడు నిర్మాత. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్తర భారత దేశంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న వినోదాత్మక కథాంశమిది. త్వరలోనే టైటిల్‌ని ఖరారు చేస్తాం. ఈ నెల 25న షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: పృధ్వీతేజ్, సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామస్వామి, సమర్పణ: డీఎస్ రావు.