TSMSIDC MD Son Dies Of Heart Stroke In Hyderabad - Sakshi
Sakshi News home page

Abhijith Reddy: 22ఏళ్లకే గుండెపోటు.. 50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే..

Published Tue, Sep 27 2022 10:30 AM | Last Updated on Tue, Sep 27 2022 10:50 AM

TSMSIDC MD Son Deceased with heart Stroke in Hyderabad - Sakshi

అభిజిత్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు అభిజిత్‌ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.

కాగా, కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభిజిత్‌ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ  ఆయిల్‌ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్‌ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చదవండి: (గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement