పలు సూపర్‌హిట్ బాలీవుడ్ చిత్రాల్లో డాన్సర్‌గా కనిపించిన ఫేమస్ డాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని అభిజిత్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అభిజిత్ మృతదేశం వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తన బ్యాంక్ అకౌంట్‌ను కుమార్తెకు ట్రాన్స్‌పర్ చేయమని కొరినట్టుగా పోలీసులు తెలిపారు. కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అభిజిత్ షిండే డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోలు రణవీర్, రణ్‌బీర్‌లతో పలు సూపర్ హిట్ పాటల్లో డాన్స్ చేశాడు అభిజిత్ షిండే.
Comments
Please login to add a commentAdd a comment