టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక నుంచి నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేశావ్ కదా అన్న అంటూ సుప్రీత తన నోట్‌లో రాసుకొచ్చింది.
నీకోసం చెల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.. వెనక్కి వచ్చేయ్ అన్న అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 'మిస్ యూ కేపీ అన్న.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావ్.. ఐ లవ్ యూ సో మచ్.. రెస్ ఇన్ పీస్' అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇది చదవండి: 'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే)
కాగా.. కేపీ చౌదరి నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించారు. కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment