ఘాటుగా... | Mirchi Lanti Kurradu movie reday for release | Sakshi
Sakshi News home page

ఘాటుగా...

Published Thu, Dec 11 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

ఘాటుగా...

ఘాటుగా...

 ఆ కుర్రాడు చాలా యాక్టివ్. సరదా సరదాగా ఉంటాడు. కానీ, ఎవరైనా కానిపని చేశారో చెలరేగిపోతాడు. మిర్చిలోని ఘాటుతో ఈ కుర్రాడి దమ్మూ, ధైర్యాన్ని పోల్చవచ్చు. ఈ కుర్రాడి కథ ఏంటి? సరదాగా ఎంజాయ్ చేసే వయసులో మిర్చి స్థాయిలో ఎందుకు చెలరేగాల్సి వచ్చిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించిన చిత్రం ఇది.
 
 జయనాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న యూత్‌ఫుల్ మూవీ ఇది. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ అద్భుతంగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉండే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement