నాగ్ సరసన! | Lavanya Tripati to romance Nagarjuna? | Sakshi
Sakshi News home page

నాగ్ సరసన!

Published Sun, Nov 9 2014 11:52 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ సరసన! - Sakshi

నాగ్ సరసన!

 ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారట. అక్కినేని నాగార్జునకు జోడీగా నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. కల్యాణకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నటించనున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. నిర్మాత రామ్మోహన్ కథ అందించిన ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. నాగార్జున ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. కథ రీత్యా ఇందులో ఇద్దరు కథానాయికలు. ఓ నాయికగా ఇప్పటికే రమ్యకృష్ణను ఖరారు చేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇక రెండో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు తెలిసింది. అందాల రాక్షసి, దూసుకెళ్తా చిత్రాలతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య, ‘మనం’ చిత్రంలో నాగచైతన్య స్నేహితురాలిగా ఓ గెస్ట్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఏకంగా నాగ్‌తోనే జతకట్టే ఛాన్స్ కొట్టేశారంటే.. నిజంగా లావ్యణ్య లక్కీనే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement