మన్మథుడికి జోడీగా తమన్నా | Tamanna to Romance with Nagarjuna | Sakshi
Sakshi News home page

మన్మథుడికి జోడీగా తమన్నా

Sep 6 2016 11:08 PM | Updated on Jul 15 2019 9:21 PM

మన్మథుడికి జోడీగా తమన్నా - Sakshi

మన్మథుడికి జోడీగా తమన్నా

మన్మథుడితో తమన్నా జోడీ కడుతున్నారు. మన్మథుడు అంటే నాగార్జున అనుకునేరు. తమిళ హీరో శింబు. ఆన్‌స్క్రీన్ ‘మన్మథ’

 మన్మథుడితో తమన్నా జోడీ కడుతున్నారు. మన్మథుడు అంటే నాగార్జున అనుకునేరు. తమిళ హీరో శింబు. ఆన్‌స్క్రీన్ ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమా లతో పాటు ఆఫ్‌స్క్రీన్ నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన శింబు మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరోకి జంటగా ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఎఎఎ) సినిమాలో తమన్నా నటిస్తున్నారు. ఆమెకు శింబుతో తొలి సినిమా ఇది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీయా ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
 ఇప్పుడు తమన్నాని నాయికగా తీసుకున్నారు. ఈ ఇద్దరూ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటారట. ముగ్గురు నాయికలు నటిస్తున్న సినిమాలో తమన్నా ఎందుకు నటిస్తున్నారంటే కథే కారణం అంటున్నారు దర్శకుడు. ‘‘సినిమాలో మెయిన్ ట్విస్ట్‌కి తమన్నా క్యారెక్టరే కారణం. వెరీ ఇంపార్టెంట్ రోల్’’ అని దర్శకుడు తెలిపారు. కథ విని తమిళ సినిమాల్లో ఇప్పటివరకూ ఇంత డిఫరెంట్, ఫ్రెష్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ రాలేదని తమన్నా అప్రిషియేట్ చేశారని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement