శింబుకు జతగా మిల్కీ బ్యూటీ | Simbu and Tamanna to romance for first time..? | Sakshi
Sakshi News home page

శింబుకు జతగా మిల్కీ బ్యూటీ

Published Wed, Sep 7 2016 3:22 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

శింబుకు జతగా మిల్కీ బ్యూటీ

శింబుకు జతగా మిల్కీ బ్యూటీ

నటి తమన్నా ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాహుబలి చిత్రం తరువాత తమన్నా తమిళంలోనే అధిక చిత్రాలు చేస్తున్నారు. ఇందుకు ఇక్కడ వరుస విజయాలు ఒక కారణం కావచ్చు. బాహుబలి, తోళా, ఇటీవల తెరపైకి వచ్చిన ధర్మదురై చిత్రాలు తమన్నా మార్కెట్‌ను పెంచాయి. ప్రస్తుతం విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రం లో నటిస్తున్నారు. తాజాగా సంచలన నటుడు శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది.
 
  శింబు ప్రస్తుతం అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.త్రిష ఇల్ల న్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇక పాత్ర 90 కాలఘట్టానికి చెందిందిగా ఉంటుందట. ఈ పాత్రకు జోడిగా నటి శ్రీయ ఇప్పటికే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇద్దరు హీరోయిన్లు చిత్రంలో ఉంటారని చిత్ర యూనిట్ ఇంతకు ముందే పేర్కొంది.అందులో ఒకరిగా నటి తమన్నాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం.
 
  అయితే ఈ పాత్ర కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. నటి హన్సిక నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే చాలా మంది శింబుతో నటించడానికి నిరాకరించినట్లు ప్రచారం జరి గింది. ఏదేమైతేనేం చివరికి నటి తమన్నా శింబుతో నటించడానికి సై అన్నారు. ఇప్పటికే శింబు,శ్రీయలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. ఇక శింబు, తమన్నాల సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని సమాచారం. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో మహత్, వీటీవీ.గణేశ్, వైజీ.మహేంద్రన్ నటిస్తున్నారు.
 
  గ్లోబల్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై నిర్మాత మైఖేల్‌రాయప్పన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శింబు,శ్రీయలపై చిత్రీకరించిన గీతం సింగిల్ ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.
 
 అంతకు ముందు విజయ్, సూర్య, కార్తీ అంటూ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిల్కీబ్యూటీ తాజాగా ఇంతకు ముందెప్పుడూ జత కట్టని హీరోతో నటించడం గమనార్హం. ధర్మదురై  చిత్రంలో తొలిసారిగా విజయ్‌సేతుపతితో జత కట్టారు.ఆ తరువాత విశాల్‌తో ఫస్ట్‌టైమ్ నటిస్తున్నారు. ఇక శింబు కలయికలోనూ ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. అదే విధంగా నటి శ్రీయతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం అన్భానవన్ అసరాదన్ అడంగాదవన్‌నే అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement