పిచ్చ హ్యాపీ! | i am full happy about my moives | Sakshi
Sakshi News home page

పిచ్చ హ్యాపీ!

Published Mon, Nov 28 2016 11:02 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

పిచ్చ   హ్యాపీ! - Sakshi

పిచ్చ హ్యాపీ!

‘‘నేను నటించబోయే సినిమాల గురించి ఇప్పుడేం చెప్పలేను. కానీ, అవేంటో తెలిస్తే నా అభిమానులతో సహా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాల్లో నేనూ ఓ భాగం అవుతున్నానని తెలియగానే చాలా సంతోషపడ్డా’’ అన్నారు తమన్నా. ఎవరెవరికి జోడీగా.. ఏయే సినిమాల్లో నటించనున్నారో మరి! పూర్తి వివరాలు చెప్పకుండా పిచ్చ హ్యాపీగా ఉన్నానంటూ అందర్నీ ఆలోచనలో పడేశారు తమన్నా. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే... నాగార్జునతో ఈ మిల్క్ బ్యూటీ జోడీ కడుతున్నారట! వీళ్లిద్దరూ ‘ఊపిరి’లో నటించారు. కానీ, అది రెగ్యులర్ హీరో, హీరోయిన్ సినిమా కాదు.

త్వరలోనే ఇద్దరూ జంటగా నటిస్తారట! నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజుగారి గది-2’లో తమన్నాను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేశారట. సినిమాలో మరో హీరోయిన్‌కీ చోటుంది. ఆ పాత్రకు ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్ పేరు వినిపిస్తోంది. తమన్నా మాట్లాతున్నది ‘రాజుగారి గది-2’ గురించేనా? కాదా? అనేది రెండు వారాల్లో స్పష్టత వస్తుంది. ఎందుకంటే.. డిసెంబర్ తొలివారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఇది కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు తమన్నా ఖాతాలో ఉన్నాయట. వాటి గురించి ఇప్పుడే చెప్పనని ఊరిస్తున్న తమన్నా ఎప్పుడు చెబుతారో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement