
అఖిల్‌కి జోడీగా అలియా?
‘2 స్టేట్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న యువతరానికి డ్రీమ్‌గాళ్ అయిపోయారు అలియాభట్. తమిళమ్మాయి ‘అనన్య స్వామినాథన్’గా ఆ సినిమాలో అలియా నటనకు యూత్ ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు.
‘2 స్టేట్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న యువతరానికి డ్రీమ్‌గాళ్ అయిపోయారు అలియాభట్. తమిళమ్మాయి ‘అనన్య స్వామినాథన్’గా ఆ సినిమాలో అలియా నటనకు యూత్ ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ పాత్రతో దక్షిణాదిలో కూడా ఫాలోయింగ్ సంపాదించారామె. అందుకే... అలియాను దక్షిణాదిన నటింపజేయాలని ఇప్పటికే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమిళంలో ఇప్పటికే ఓ సినిమాకు ఆమె పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇదిలావుంటే... త్వరలో తెలుగుతెరపై కూడా అలియాభట్ తళుక్కున మెరువనున్నారట. పైగా అది సాదాసీదా సినిమా కాదు. హీరోగా అఖిల్ తొలి సినిమా.
హీరోగా అఖిల్ అరంగేట్రం అదిరిపోయే స్థాయిలో ఉండేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. అందుకే... సెంటిమెంట్‌ని గౌరవిస్తూ - హీరోల వారసుల్ని విజయవంతంగా పరిచయం చేసిన నిర్మాత సి.అశ్వనీదత్‌కి అఖిల్‌ను పరిచయం చేసే అవకాశాన్ని నాగార్జున ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమాకు నాగార్జున కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తారని వినికిడి. ‘ఇష్క్, మనం’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన దర్శకుడు విక్రమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడని తెలుస్తోంది. ఇటీవలే నాగ్‌కి విక్రమ్ ఓ లైన్ చెప్పారని, అది నాగార్జునకు విపరీతంగా నచ్చిందని సమాచారం. ఈ సినిమా కోసమే అఖిల్‌కి జోడీగా అలియాభట్‌ని తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. అంటే త్వరలో అఖిల్-అలియా స్వీట్ కాంబినేషన్‌ని అలరించనుందన్నమాట.