‘బ్రహ్మాస్త్రం’ చిత్రంలోని తర్వాతి భాగాలను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మరింత సమయం వేచి ఉండక తప్పదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిందీ ట్రయాలజీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాల ‘బ్రహ్మాస్త్రం’లోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ వన్ శివ’ గత ఏడాది సెప్టెంబరు 9న విడుదలై, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పా త్రల్లో ఈ చిత్రం రూ΄పొందింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. కాగా ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్టు 2 దేవ్’, ‘బ్రహ్మాస్త్ర’ థర్డ్ పా ర్టులను వరుసగా 2026 డిసెంబరు, 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
‘‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ 1 శివ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్ పా ర్ట్, థర్డ్ పా ర్ట్ స్క్రిప్ట్స్‌పై మరింత ఫోకస్ పెట్టాను. అలాగే ఈ రెండు సినిమాలను ఏడాది గ్యాప్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అలాగే తాను మరో సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఉందని, సరైన టైమ్‌లో ఆ విషయాన్ని వెల్లడిస్తానని కూడా అయాన్ పేర్కొన్నారు. దాంతో ఇది ‘వార్ 2’ సినిమా గురించే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment