బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది.
(చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ)
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాకపోయినప్పటికీ ఇండియా వైడ్‌గా రూ. 35-38 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్‌లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్) వసూళ్లను సాధించింది.
తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్ ధూమ్ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.
Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K
— Karan Johar (@karanjohar) September 10, 2022
Comments
Please login to add a commentAdd a comment