Nikhil's Mudra Movie Title Changed to Arjun Suravaram - Sakshi
Sakshi News home page

Published Mon, Feb 4 2019 12:22 PM | Last Updated on Mon, Feb 4 2019 1:00 PM

Nikhil Movie Title Changed As Arjun Suravaram - Sakshi

టైటిల్‌పై జరిగిన పోరులో హీరో నిఖిల్‌ కాస్త వెనక్కితగ్గి.. తన తదుపరి చిత్రం పేరును మార్చేశాడు. నిర్మాత నట్టికుమార్.. హీరో నిఖిల్‌పై అసహనం వ్యక్తం చేయడం.. ఇద్దరి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ‘ముద్ర’ టైటిల్‌ను వదులుకొన్నాడు. తాజాగా తన చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

ఈ మూవీలో జర్నలిస్ట్‌గా నటిస్తున్న నిఖిల్‌ పాత్ర పేరు అర్జున్‌ సురవరం కావడంతో.. దీన్నే టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. సోషల్‌ మీడియాలో టైటిల్‌ను సూచించమని తన అభిమానులను కోరగా.. కొంతమంది ఈ టైటిల్‌ను కూడా సూచించారు. మొత్తానికి ముద్ర నుంచి తప్పించుకున్న నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’ గా రాబోతున్నాడు. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ హిట్‌ మూవీ కణితన్‌కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement