
బై బై హైదరాబాద్... చలో మస్కట్ అంటూ సాయిధరమ్ తేజ్ ఫ్లైట్ ఎక్కేశారు. న్యూ ఇయర్‌ని మస్కట్‌లో జరుపుకుంటారని ఊహిస్తున్నారా? అదేం కాదు. షూటింగ్ కోసం వెళ్లారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా సి. కల్యాణ్ ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ముగించుకుని, మస్కట్ ప్రయాణమైంది ఈ బృందం.
‘‘ఈ నెల 18 నుంచి 28 వరకూ మస్కట్‌లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నాం. ఓ పాటకు జానీ మాస్టర్, మరో పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. మస్కట్‌లో సాంగ్స్ షూట్ పూర్తి చేసి, ఇండియా రాగానే క్లైమాక్స్ మొదలుపెడతాం. ఫిబ్రవరి 9న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ–మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: థమ¯Œ , ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: సి.వి. రావు, నాగరాజ పత్సా.
Comments
Please login to add a commentAdd a comment