Sai dharamtej
-
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు..వరుణ్ దొంగ చూపులు.. ఫోటో వైరల్
ఇంట్లో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో బెడ్‌పై ఒకే చోటు కోసం పిల్లలు కొట్టుకోవడం సర్వసాధారణం. ఎంత తిట్టుకున్న, కొట్టుకున్న సరే రాత్రి అయితే చాలు అంతా ఒకే చోట నిద్రపోతారు. అలా తాము కూడా వరుణ్, వైష్ణవ్లతో కలిసి ఒకే బెడ్‌పై నిద్రపోయేవాడినని చెబుతున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. ఇప్పటికి కూడా ఆ అలవాటు పోలేదంటూ బెడ్‌పై వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో కలిసి నిద్రపోతున్న ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు . అందులో వైష్ణవ్ అర్దనగ్నంగా పడుకొని ఉండగా, వరుణ్ దొంగచూపులు చూస్తున్నాడు. ‘కొన్ని ఎప్పటికి మారువు’అంటూ సాయితేజ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కాగా, మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్, బన్నీ, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ అంతా ఒకే ఏజ్ గ్రూపు వాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగారు. అందుకే వీళ్లు కజిన్స్‌లా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ గ్యాంగ్‌లో నిహారిక కూడా ఉంటుంది. ఆమెను మరదల్లా కాకుండా చెల్లిగానే చూసేవాళ్లమని గతంలో కొన్ని ఇంటర్యూల్లో సాయితేజ్, అల్లు అర్జున్ చెప్పారు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
మంచు వారి మూవీలో మెగా హీరో
హైదరాబాద్: మంచు, మెగా కుటుంబాల హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే సినీ ప్రియుల ఆశ నెరవేరనుందని చెప్పాలి. మంచు ఫ్యామిలీకి చెందిన ఓ హీరో సినిమాలో కొణిదల వారి మేనల్లుడు నటించనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే మనోజ్, సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం మనోజ్ నటిస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్లో వినికిడి. చాలా కాలం విరామం తర్వాత మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నరు. ఈ సినిమాలో మనోజ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు విడుదలైన మొదట ఫోస్టర్ ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి- కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లారంగా’ను మనోజ్, సాయిధరమ్ తేజ్ రీమేక్ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మనోజ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. ( చదవండి : ఇంటివాడు కాబోతున్న సాయ్ తేజ్.. మేలో పెళ్లి! ) -
అక్షర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతా..
‘‘ఈ లాక్డౌన్ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. బిజీ లైఫ్‌లో ఎంత గందరగోళంగా బతుకుతున్నానో నాకప్పుడు అర్థం అయ్యింది’’ అన్నారు సాయి తేజ్. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్ జంటగా బీవియస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయితేజ్ చెప్పిన విశేషాలు. ► కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న పెద్ద తెలుగు సినిమా మీదే! కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటారా? సాయితేజ్: సినిమా ప్రేమికులు కచ్చితంగా వస్తారు. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్ని రోజులు మిస్సయ్యాం. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి ధైర్యం నింపటం కోసం ‘టెనెట్’ సినిమా విడుదలవ్వగానే నేను థియేటర్లో చూశాను. నా తోటి హీరోలు, దర్శకులు చాలామంది థియేటర్‌కి వెళ్లి, సినిమాను థియేటర్లోనే చూడమని మోటివేట్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా మొదట మే1న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా కారణంగా వాయిదా వేశాం. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని సినిమాలో ఎందుకంటున్నారు? కాలేజీలో చదివే ఒక యంగ్ బోయ్ తన ఫ్రెండ్స్‌కి సోలో లైఫ్ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజీ నుండి బయటకు వచ్చేవాళ్లను హీరో ఎలా ఇన్స్పైర్ చేశాడనేది సినిమా. ఆ క్రమంలో అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాటినుండి ఎలా బయటపడ్డాడు అనేది కథ. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్‌ని ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ► ఈ సినిమా మీ జీవితానికి ఏమైనా దగ్గరగా ఉందా? ఈ సినిమానే కాదు.. గతంలో చేసిన ‘చిత్రలహరి’,‘ ప్రతిరోజూ పండగే’ సినిమాలను కూడా నా లైఫ్‌కి ఎంతో దగ్గరగా ఫీలయ్యాను. ఈ సినిమా అయితే మరీ దగ్గరగా ఉంటుంది. కారణం బ్యాచ్‌లర్‌ని కావటమే. సోలోగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, పిల్లలకు పెళ్లి కావాలని పెద్దవాళ్లూ అంతే గట్టిగా కోరుకుంటారు. ఫైనల్‌గా వాళ్లే గెలుస్తారు. మా ఇంట్లో రోజూ సుప్రభాతం తర్వాత ‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతాను. ఆ టైమ్‌లో మా అమ్మని కాఫీ అడిగితే నా వైపు ఓ చూపు చూసి ‘నువ్వే పెట్టుకో’ అంటుంది (నవ్వుతూ). ► పిల్లలకు పెళ్లవ్వాలని పెద్దవాళ్లు బలంగా కోరుకుంటారని అన్నారు.. మరి.. మీ పెళ్లెప్పుడు? పెళ్లి చేసుకుంటే ‘ఇంటికి ఎప్పుడొస్తావ్? ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అదే సోలోగా ఉంటే, మహా అయితే అమ్మ ఫోన్ చేసి ‘తిన్నావా?’ అని ఒకసారి అడుగుతుంది. ‘తిన్నానమ్మా’ అంటే మళ్లీ ఫోన్ రాదు. మా అమ్మ కోసం, ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి ఓకే అన్నా. కానీ 2020లో షూటింగ్‌లకు గ్యాప్ రావటం వల్ల చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కమిట్ అయిన సినిమాలు అవ్వగానే చూడాలి. ► లాక్డౌన్ ఏమైనా నేర్పించిందా? ఓర్పు, సహనంతో పాటు కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. మనం ఒక ప్లాన్‌లో ఉంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. దానికి తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి? మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. వాటర్ బాటిల్స్ పట్టడం ఎంత కష్టమో లాక్డౌన్ బాగానే నేర్పించింది (నవ్వుతూ). ► కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. వాటివల్ల సినిమా పరిశ్రమకు నష్టమా? కరోనాతో నష్టపోయిన సినిమా పరిశ్రమ ఇప్పట్లో కోలుకుంటుంది అనుకుంటున్నారా? ఇండస్ట్రీ డబుల్ స్పీడ్‌లో రికవర్ అవుతుందని నా నమ్మకం. ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. అలాగే ఇప్పుడు సినిమాలు చేసేవారు ఎంతో బాధ్యతతో చేస్తారు. ప్రొడక్షన్ వేల్యూస్‌ను పెంచుకుంటూ నటీనటుల దగ్గర నుండి వంద శాతం నటనను రాబట్టుకొని సినిమాలు చేస్తారు. మనకు ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాం. పోటీ మంచిదే. ► కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి..? 2020లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలనుకుంటున్నాను. పరిగెడుతున్న కాలం ఒక్కసారిగా ఆగిపోయినా ధైర్యం కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. జీవితం ఆగిపోయిందే అనుకోకుండా దమ్ముగా, ధీటుగా ముందుకెళ్లాలి. మనతోపాటు ప్రకృతి బతకాలి. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి పొల్యూషన్ లేకుండా బతకడానికి అవకాశం ఇవ్వాలి. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేది నా నూతన సంవత్సరం రిజల్యూషన్ అనుకోవచ్చు. -
ఐదు సినిమాలు చేసి ఊరెళ్లిపోతానన్నాడు
‘‘దర్శకుడు సుబ్బు నిబద్ధత ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం కన్విక్షన్‌తో పని చేశాడు. నాకు కథను ఎంత కసితో చెప్పాడో సినిమాను అంతే కసిగా తీశాడు’’ అని హీరో సాయితేజ్ అన్నారు. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జీ స్టూడియో అసోసియేషన్‌తో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. టైటిల్ ట్రాక్‌ను శుక్రవారం విడుదల చేశారు. సాయితేజ్ మాట్లాడుతూ –‘‘సుబ్బు ఐదు సినిమాలు చేసేసి ఊరెళ్లిపోతానని అన్నాడు. కానీ.. తను యాభై సినిమాలు చేయాలనుంది. ‘నో పెళ్లి..’ పాట లిరికల్ వీడియోలో రానా, వరుణ్ తేజ్ కూడా నటించారు. ఈ పాటను నితిన్ విడుదల చేశారు. ఈ ముగ్గురికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కథను, నన్ను నమ్మి సినిమా చేసినందుకు సాయితేజ్‌కి కృతజ్ఞతలు. నిర్మా తలు కుటుంబ సభ్యుడిలా భావించి నాకు సహకారం అందించారు’’ అన్నారు సుబ్బు. ‘‘ఆరేడు నెలల అజ్ఞాతవాసం తర్వాత పాండవులలా బాక్సాఫీస్ యుద్ధానికి సినీ ఇండస్ట్రీ బయలుదేరింది’’ అన్నారు రాజేంద్ర ప్రసాద్. ‘‘మనం ఎప్పుడు చూసినా తుది గెలుపు సినిమాదే’’ అన్నారు రావు రమేశ్. జీ స్టూడియోస్ ప్రతినిధి నీరజ్ జోషీ, గీతరచయితలు కాసర్ల శ్యామ్, రఘురామ్ పాల్గొన్నారు. -
ఇది చాలదని చరణ్ అన్నారు
‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అన్నారు సాయితేజ్. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఎస్కేఎన్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన సంగతులు. ► ఇది తాత–మనవడి కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంచాలనుకుంటాడు మనవడు. తాత కోసం ఆ మనవడు ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌గారు, మనవడి పాత్రలో నేను నటించాను. నా తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు నటించారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న డైనింగ్ టేబుల్ సన్నివేశం తీసేటప్పుడు నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కనెక్ట్ అయ్యాను. ► దాదాపు పదేళ్ల క్రితం మారుతి అన్నను ఓ సంద ర్భంలో కలిశాను. అప్పుడు ఓ కథ చెప్పారు. నిజానికి నాకు అప్పటికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ, కథ విన్నా. మారుతి అన్న డైరెక్షన్లో సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది. అయితే అప్పుడు ఆయన చెప్పిన కథ ఇది కాదు. మా సినిమా విడుదలవుతున్న రోజునే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మా సినిమాతో పాటు అవికూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ► ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగాను. ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాను. ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్న ఓ సన్నివేశంలో ఫైట్ సీన్ కోసం షర్ట్ విప్పాల్సి ఉంటుంది. ్ఞఅలా ఆ సీన్లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాను. ► ఓసారి నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చరణ్ (రామ్‌చరణ్) చూశారు. ‘ఇది చాలదు’ అని ‘ధృవ’ సమయంలో తనకు జిమ్ ట్రైనర్‌గా ఉన్న రాకేష్ ఉదయార్ను సూచించారు. సరైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాను. మరోసారి బరువు పెరిగి తగ్గాలనుకోవడం లేదు. అంత ఓపిక లేదు (నవ్వుతూ). ► చిరంజీవిగారు ‘ప్రతిరోజూ పండగే’ కథ విన్నారు. బాగా చేయాలన్నారు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అది నాకు ప్లస్సో, మైనస్సో అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా భావిస్తున్నాను. -
అల్లు అరవింద్ డాన్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేదిక మీదకు తీసుకెళ్లి డాన్స్ చేయాలని కోరారు. సీనియర్ నటుడు సత్యరాజ్‌తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మారుతి దర్శకత్వం తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కుమార్, నరేశ్, రావురమేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. Team #PratiRojuPandaage justifying the tagline"పది మంది ఉండగా,ప్రతిరోజూ పండగే the expectations &buzz of the movie reached sky high with this electrifying moments frm pre-release🕺💃 All set for the celebrations on Dec 20th in the theatres near you 🤩#PratirojuPandaageOnDec20th pic.twitter.com/bHIMRQlgDF — Eluru Sreenu (@elurucnu) December 16, 2019 -
‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్లో గొడవ
సాక్షి, గుంటూరు ఈస్ట్: ‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ యాత్రలో భాగంగా గుంటూరు భాస్కర్ థియేటర్‌కు హీరో సాయిధరమ్ తేజ్, కథానాయకి రాశీఖన్నా వచ్చారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. -
చిరంజీవిగారి సంస్కారం తేజ్‌కి ఉంది
‘‘సాయితేజ్ సినిమా చేస్తున్న ప్పుడు ఇతర పాత్రలకు ప్రాధా న్యం ఉండేలా చూస్తాడు. తన పాత్రతో పాటు ఇతర పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తే ఎంత మంచి సినిమా వస్తుందో చిరంజీవిగారికి బాగా తెలుసు. ఆయన లక్షణం తేజ్‌లో ఉంది’’ అన్నారు అల్లు అరవింద్. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడులవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను థియేటర్లో కుటుంబంతో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు. చెప్పిన టైమ్‌కి మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. ఈ కథకు ఆడియ¯Œ ్స కనెక్ట్ అవుతారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడానికి సహకరించిన నా టీమ్‌కి, గీతా, యూవీ బ్యానర్స్‌కు థ్యాంక్స్. కథ వినగానే చేద్దామని తేజ్ చెప్పాడు. సత్యరాజ్‌గారు ముందు తాత పాత్ర చేయనన్నారు. కథ విన్నాక ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘చిత్రలహరి’ సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి నుండి మీరు (మెగా అభిమానులు) తలెత్తుకునే సినిమాలే చేస్తాను. ‘ప్రతిరోజూ పండగే’ మీ అంచనాలకు మించి ఉంటుంది. ఇందుకు నాది, మారుతిది గ్యారెంటీ’’ అన్నారు సాయితేజ్. ‘‘అందరికీ నచ్చే సినిమా ఇది. తేజ్‌తో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. సంగీత దర్శకుడు తమన్, నటుడు రావు రమేశ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
అమెరికాలో పండగ
‘సుప్రీమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత సాయితేజ్–రాశీఖన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ తర్వాతి షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సాయితేజ్‌ను కొత్తగా చూపించబోతున్నారు మారుతి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని భావోద్వేగంగా చిత్రీకరిస్తున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుంది. సాయితేజ్, నటుడు సత్యరాజ్ ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. సత్యరాజ్ క్యారెక్టర్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు మారుతి. రావు రమేశ్ పాత్ర కూడా సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో సాయి తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.కె.ఎన్, సంగీతం: తమన్, కెమెరా: జయకుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
కొత్త జోడీ
వరంగల్ చాందినీగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మస్త్ హుషారైన పాత్ర చేశారు నభా నటేశ్. ఇపుడు మాస్ రాజా రవితేజతో ‘డిస్కో రాజా’ చేస్తున్నారు నభా. హీరోయిన్గా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారని తెలిసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జె.భగవాన్, పుల్లయ్య నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేశ్‌ను ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు సాయిధరమ్. ఈ సినిమా పూర్తి కాగానే దేవా కట్టా సినిమా ప్రారంభం అవుతుంది. -
అందమైన అనుభవం
‘‘నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడినని కె.ఎస్.రామారావుగారు చెప్పడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే.. నేను మాంటిస్సోరి స్కూల్లో చదువుకునే రోజుల్లో రామారావుగారు కె.ఎస్.ప్రకాశ్రావుగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవారు’’ అని నిర్మాత సి. అశ్వనీదత్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ చిత్రం గ్రాండ్ ప్రీ–రిలీజ్ వేడుకలో అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘మా సూర్యారావు పేటలో ఆ రోజుల్లో రామారావుగారిని కలవడమంటే గ్లామర్‌గా ఫీలయ్యేవాళ్లం. ఆయన్ను చూసి గర్వపడతాం. ఇవాల్టికి కూడా ఆయన సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్ మన సినిమాల్లో లేదేమో అని ఫీల్ అవుతుంటాను’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాకి నేను తీసుకురాలేని ఇళయరాజాగారిని తీసుకొచ్చి సినిమాలు చేసి హిట్స్ కొట్టేసరికి రామారావుగారంటే చిన్న అసూయ ఉండేది. ఆయనతో సినిమాలు తీయడంలో పోటీ పడేవాణ్ని. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు, మూడు సరిగ్గా ఆడలేదు. అంతా సవ్యంగానే ఉందా? అంటే.. ‘బాస్.. లాభమా నష్టమా? అని ఆలోచించను. నా దగ్గర ఆఖరి రూపాయి ఉన్నంత వరకు సినిమాల్లోనే పెడతాను.. సినిమాల్లోనే చనిపోతా’ అన్నారు. అది విని నా గుండె జల్లుమంది. రామారావుగారి అంతటి ప్యాషన్‌ను మళ్లీ అశ్వనీదత్గారిలోనే చూడాలి. ఇలా సినిమాలను ప్రేమిస్తున్న స్నేహితులు ఉండటం నా అదృష్టం. దశాబ్దాలు కొనసాగేంత డెడికేషన్ ఉన్న హీరో తేజు’’ అన్నారు. ‘‘నేను రేడియో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో అశ్వనీదత్, అల్లు అరవింద్గారితో పరిచయం ఉంది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం’’ అన్నారు కె.ఎస్.రామారావు. ‘‘నా కెరీర్లో ఓ ఇంపార్టెంట్ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్ చేస్తే కె.ఎస్.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘తొలిప్రేమ’ నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. తక్కువ సినిమాలే చేసినా పెద్ద నిర్మాతలతో చేశా. జాతీయ అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అన్నారు ఎ.కరుణాకరన్. -
తేజు చాలా ఎనర్జిటిక్ – కేయస్ రామారావు
‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. కరుణాకరన్ అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన అటూ ఇటూ తిరుగుతూ సెట్లోనే ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను కో–ఆర్డినేట్ చేసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘మా హీరో తేజు వింటర్లో డేట్స్ ఇవ్వమంటే సమ్మర్లో ఇచ్చారు (నవ్వుతూ). తేజు చాలా ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. ఈ నెల 11కి మేజర్ పార్ట్ పూర్తవుతుంది. 23, 24 తేదీల్లో విమానాశ్రయంలో షూటింగ్ జరపనున్నాం. మే మొదటి వారంలో ఫ్రాన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ‘డార్లింగ్’ స్వామి చక్కటి డైలాగులు రాశాడు’’ అన్నారు. ‘‘టైటిల్ అనుకోలేదు. ఓ మంచి టైటిల్ అనుకుని త్వరలో చెబుతాం’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్, కెమెరామెన్ ఆండ్రూ, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
ఇంత గ్రాండ్‌గా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైమ్
‘‘నాకు అమ్మాయిలు లేరు. అనుపమా పరమేశ్వరన్ నాకు అమ్మాయిలాంటిది. తను మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తన పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది. ఇదే రోజు మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయిక అనుపమ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. సోమవారం ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో సాయిధరమ్‌తేజ్ జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 20 వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. కె.ఎస్.రామారావుగారు, సాయిధరమ్ సహా యూనిట్‌కు థ్యాంక్స్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. సాయిధరమ్‌తేజ్, దర్శకుడు కరుణాకరన్, సహ నిర్మాత కె.ఎ.వల్లభ, సినిమాటోగ్రాఫర్ అండ్రూస్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
తెలివిగా తీశారని ప్రేక్షకులు అంటారు
‘‘నా సినిమాలు సూపర్ హిట్ సాధించకపోవచ్చు. నా కెరీర్లో సూపర్ ఫ్లాప్ సినిమా లేదు. బ్యాడ్ లేదా వల్గర్ సినిమాలను కల్యాణ్ తీశాడని అనిపించుకోలేదు. సెట్ అయ్యే ప్రాజెక్ట్ కోసమే తపన పడతాను. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని ఎగబడలేదు. రామానాయుడిగారిని స్ఫూర్తిగా ఫీలయ్యి కెరీర్లో ముందుకు సాగుతున్నాను. ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో తెలీదు. నిర్మాతగా వంద చిత్రాలను కంప్లీట్ చేయాలన్నది నా ప్రయత్నం’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్పై సి. కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఈ ఏడాది ‘జై సింహా’ చిత్రంతో నిర్మాతగా నాకు శుభారంభం జరిగింది. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వీవీ వినాయక్‌గారు దర్శకత్వం వహించిన ‘ఇంటిలిజెంట్’అందరి అంచనాలను మించేలా ఉంటుందన్న నమ్మకం ఉంది. తేజూ కెరీర్ గ్రాఫ్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుంది. తేజూ డ్యాన్స్ ఇరగదీశాడు. చాలా కష్టపడ్డాడు. ‘ఇంటిలిజెంట్’ చూసిన తర్వాత, వీళ్లు చాలా ఇంటెలిజెంట్‌గా తీశారని ప్రేక్షకులు అనుకుంటారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. వినాయక్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఆడుతూ పాడుతూ సినిమాను కంప్లీట్ చేశాం. ► ఒకే టైమ్‌లో మోహన్‌బాబుగారి ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’.. ఇంకా వేరే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ నెక్ట్స్ డే ‘తొలి ప్రేమ’ రిలీజ్ అవుతుంది. మోహన్‌బాబుగారి ఇంటి నుంచే నా సినీ ప్రయాణం మొదలైంది. నాగబాబు, వరుణ్‌తేజ్‌లతో మంచి ఎటాచ్మెంట్ ఉంది. మా సినిమాతో పాటు రిలీజ్ కానున్న అన్ని సినిమాలూ ఆడాలి. ► న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. సుమన్ హీరోగా ‘నేటి న్యాయం’ చిత్రంతో నేను డైరెక్టర్‌గా పరిచయం కావాల్సింది కానీ కుదర్లేదు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా 70వ సినిమా ‘ఇంటిలిజెంట్’. కథలో ఇన్వాల్వ్ అవుతాను. కాకపోతే నా ఆలోచనలను సూచనలుగా పరిశీలించమని డైరెక్టర్‌కు చెబుతాను. ► ఓ చిన్న డైరెక్టర్‌తో ‘భారతి’ అనే సినిమాను తీయబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను. శివ దర్శకత్వంలో రానా హీరోగా చేస్తున్న ‘1945’ చిత్రం ఫైనల్ స్టేజ్‌లో ఉంది. వినాయక్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నా. -
చలో మస్కట్
బై బై హైదరాబాద్... చలో మస్కట్ అంటూ సాయిధరమ్ తేజ్ ఫ్లైట్ ఎక్కేశారు. న్యూ ఇయర్‌ని మస్కట్‌లో జరుపుకుంటారని ఊహిస్తున్నారా? అదేం కాదు. షూటింగ్ కోసం వెళ్లారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా సి. కల్యాణ్ ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ముగించుకుని, మస్కట్ ప్రయాణమైంది ఈ బృందం. ‘‘ఈ నెల 18 నుంచి 28 వరకూ మస్కట్‌లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నాం. ఓ పాటకు జానీ మాస్టర్, మరో పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. మస్కట్‌లో సాంగ్స్ షూట్ పూర్తి చేసి, ఇండియా రాగానే క్లైమాక్స్ మొదలుపెడతాం. ఫిబ్రవరి 9న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ–మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: థమ¯Œ , ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: సి.వి. రావు, నాగరాజ పత్సా. -
కాంబినేషన్ కుదిరింది..కల నిజమైంది!
మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో ఓ సినిమా చేయాలన్నది సాయిధరమ్ తేజ్ కల. ఆ కల ఈజీగానే నెరవేరింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తేజ్ హీరోగా శుక్రవారం ఓ సినిమా మొదలైంది. ‘‘వినాయక్‌గారితో లొకేషన్లో ఫస్ట్ డే. ఇది నిజమేనా అనిపిస్తోంది. కలలు నిజమవుతాయని అర్థమైంది’’ అని సాయిధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు.. మేనమామ చిరంజీవితో రెండు హిట్ సినిమాలు (‘ఠాగూర్’, ‘ౖఖైదీ నెం. 150’)æ తీసిన డైరెక్టర్ తనతో సినిమా చేయడం అంటే మేనల్లుడికైనా ఆనందంగానే ఉంటుంది కదా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది అని సమాచారం. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా విన్నర్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్‌తో పాటు కామెడీ పంచ్‌లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
-
విన్నర్‌కు భారీ బడ్జెట్
మెగా వారసుల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్‌తో సత్తా చాటిన సాయి, ఇప్పుడు తన మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకునే పనిలో పడ్డాడు. గత సినిమాలతో 20 కోట్ల వరకు షేర్ సాధించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాతో మరో అడుగు ముందుకేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమాలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టర్కీ, ఉక్రేయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు సాయి ధరమ్‌తేజ్. -
సౌతిండియన్ లుక్ వల్లే ‘తిక్క’లో అవకాశం వచ్చింది!
- లారిస్సా బొనేసి బ్రెజిల్ అమ్మాయి లారిస్సా బొనేసి తెలుగు తెరపై జిగేల్మని మెరిసిపోవాలని కలలుగంటోంది. సాయిధరమ్‌తేజ్ సరసన ‘తిక్క’లో నటించిన ఆమె భవిష్యత్తులో మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో కలసి నటించడమే లక్ష్యమంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాగుందనీ, ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్న తీరు, చూపుతున్న ప్రేమాభిమానాలు కట్టిపడేశాయని చెబుతోంది. తెరపై తనను తాను చూసుకొన్నప్పుడు అచ్చం తెలుగమ్మాయిల్లాగే కనిపించానని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స పతాకంపై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించిన ‘తిక్క’ ఈ నెల 13న విడుదలతోంది. ఈ సందర్భంగా ‘తిక్క’ అవకాశం, ఆ సినిమా సెట్లో తనకి ఎదురైన అనుభవాల గురించి, భవిష్యత్తు గురించి లారిస్సా చెప్పిన విశేషాలు... నేను బ్రెజిల్ అమ్మాయినైనా ఒక భారతీయ కథ లోనూ, ఒక పాత్రలోనూ నన్ను నేను చూసుకోవడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. దర్శకుడు సునీల్‌రెడ్డి చెప్పిన ‘తిక్క’ కథనీ, అందులోని అంజలి పాత్రనీ అర్థం చేసుకొన్నాక నా నిజ జీవితానికి దగ్గరగా ఉందనిపించింది. అందుకే ఈ కథతో, పాత్రతో ఈజీగా రిలేట్ అయ్యా. సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను అంజలిగానే గుర్తు పెట్టుకొంటారు. సారుుధరమ్ తేజ్‌తో కలిసి నటించడం చక్కటి అనుభవం. అతను ఓ పెద్దింటి కుర్రాడైనప్పటికీ సెట్లో నడుచుకొనే విధానం, నలుగురితో కలసిపోయే విధానం బాగా నచ్చింది. దర్శకుడు సునీల్‌రెడ్డి వల్లే ఈ చిత్రంలో బాగా నటించ గలిగా. సినిమా పూర్తయ్యేలోపు రఘుబాబు, ముమైత్‌ఖాన్ , మన్నారా చోప్రా... ఇలా అందరితోనూ ఓ బాండింగ్ ఏర్పడింది. యాడ్ చూసి చాన్స్ ఇచ్చారు విదేశాలకి చెందిన అమ్మాయినైనా నా ప్రతిభను నమ్మి అవకాశమిచ్చారు దర్శక-నిర్మాతలు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాలనుకొన్నా. అందుకే ఒక టీచర్ని నియమించుకొని మరీ తెలుగు భాషపై పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నించా. పధ్నాలుగేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించా. అంతర్జాతీయ స్థారుులో పేరు తెచ్చుకొన్నా. ఒక యాడ్‌లో నన్ను చూసిన ‘తిక్క’ దర్శక- నిర్మాతలు ఈ అవకాశాన్నిచ్చారు. సౌత్ ఇండియన్ లుక్‌తో కనిపించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని నమ్ముతున్నా. అంతా కొత్తే... మోడలింగ్‌తో పోలిస్తే సినిమా ఓ సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఒక కథలోని పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనే విషయాన్ని సినిమా బాగా నేర్పించింది. తెలియని భాష, తెలియని ప్రాంతం, తెలియని మనుషులు... అంతా కొత్తే. కానీ ‘తిక్క’ బృందం నన్ను వాళ్లలో ఒకరిగా భావించి చేరదీశారు. అందుకే వాళ్లతో జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. అది తలచుకొంటే ఇప్పుడు కన్నీళ్లొస్తారుు. మా అమ్మానాన్నలకి ఫోన్ చేసి రోజూ ఈ యూనిట్ గురించి చెబుతుండేదాన్ని. నమస్కారం.. బాగున్నారా... ఇదివరకు హిందీలో ‘గో గోవా గాన్’ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశా. ఒక భాషకి పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగుతో పాటు కన్నడం, తమిళ పరిశ్రమల్లో అవకాశాలపై కూడా దృష్టి పెట్టా. అయితే తెలుగులో నా అభిమాన కథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్. వాళ్లిద్దరితో కలసి నటించాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇద్దరి సినిమాల్నీ నేను చూశా. ప్రస్తుతం నా ఆలోచనంతా తెలుగు భాషపై పట్టు పెంచుకోవడం గురించే. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. నమస్కారం, బాగున్నారాలాంటి మాటల్ని పలుకుతున్నా. రఘుబాబుగారు వామ్మో అనే మాటని నేర్పించారు. -
'గ్యాంగ్ లీడర్'గా సాయి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయాడు మెగాస్టార్. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా టైటిల్‌ను ఇప్పుడు ఓ మెగా వారసుడు వాడేస్తున్నాడు. చాలా కాలంగా గ్యాంగ్ లీడర్ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకముందే గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను మరో మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ వాడేస్తున్నాడు. ఇప్పటికే చిరు సినిమా టైటిల్ సుప్రీంను తీసుకున్న సాయి తన నెక్ట్స్ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను ఫైనల్ చేశాడట. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ మసాలా ఎంటర్టైనర్కు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నల్లమలపు శ్రీను భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో గోపిచంద్ దర్శతక్వంలో వరుణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. మరి అదే సినిమాను సాయితో తెరకెక్కిస్తున్నారా లేక ఇది వేరే కథా..? అన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
సాయి ధరమ్ ప్లేస్‌లో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా ఓ స్టార్ వారసుడు చేయాల్సిన సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా మూడో సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, శతమానంభవతి పేరుతో మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అచ్చమైన తెలుగు కథతో తెరకెక్కనున్న ఈ సినిమా మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఇస్తుందని భావించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా సాయికి బదులుగా రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశాడట. ప్రముఖ రచయిత వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. -
రేసుగుర్రం విలన్‌కు గాయాలు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రేసుగుర్రంతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయన నటుడు రవికిషన్. భోజ్‌పురిలో స్టార్ హీరోగా ఉన్న రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం విలన్‌గా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సుప్రీం సినిమాలో నటిస్తున్న రవికిషన్, ఓ ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, రవికిషన్ల మధ్య ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రవికిషన్ గాయపడ్డాడు. అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన చిత్రయూనిట్, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబై తరలించారు.