
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా విన్నర్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్తో పాటు కామెడీ పంచ్లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్కు రెడీ అవుతోంది.