
మావయ్య విజేత.. మేనల్లుడు విన్నర్!
‘విజేత’.. 30 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా. ఇప్పుడిదే పేరుతో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. అప్పటి ‘విజేత’ను ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ‘విన్నర్’ని చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. శనివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘కన్నతండ్రితో పాటు ప్రేమించిన అమ్మాయి మనసు గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రకథ’’ అన్నారు గోపీచంద్ మలినేని.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘హీరో పాజిటివ్ క్యారెక్టర్‌కి తగ్గట్టే మంచి టైటిల్ కుదిరింది. ఉక్రెయిన్‌లో పాటల్ని, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, జగపతిబాబు, ముఖేశ్ రుషి, అలీ, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, ఫైట్స్: రవివర్మ, కెమేరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, సమర్పణ: బేబీ భవ్య.