
మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో ఓ సినిమా చేయాలన్నది సాయిధరమ్ తేజ్ కల. ఆ కల ఈజీగానే నెరవేరింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తేజ్ హీరోగా శుక్రవారం ఓ సినిమా మొదలైంది. ‘‘వినాయక్‌గారితో లొకేషన్‌లో ఫస్ట్ డే. ఇది నిజమేనా అనిపిస్తోంది.
కలలు నిజమవుతాయని అర్థమైంది’’ అని సాయిధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు.. మేనమామ చిరంజీవితో రెండు హిట్ సినిమాలు (‘ఠాగూర్’, ‘ౖఖైదీ నెం. 150’)æ తీసిన డైరెక్టర్ తనతో సినిమా చేయడం అంటే మేనల్లుడికైనా ఆనందంగానే ఉంటుంది కదా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది అని సమాచారం.