సాయి ధరమ్ తో శృతిహాసన్ రొమాన్స్ | sai dharamtej romancing with sruthi hassan | Sakshi
Sakshi News home page

సాయి ధరమ్ తో శృతిహాసన్ రొమాన్స్

Published Sun, Nov 8 2015 1:32 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

sai dharamtej romancing with sruthi hassan

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల సరసన భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శృతిహాసన్ త్వరలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ కు రెడీ అవుతోంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వీరి జోడి పూర్తి సినిమాలో కనపించడం లేదట. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ రీమేక్ లో ఈ జోడి కనిపించనుంది.

ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య ఆ సినిమా తరువాత కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో మళయాల సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా శృతిహాసన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ మెగా హీరో మజ్ను సినిమాలో అతిధి పాత్రలో అలరించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement