సాయి ధరమ్ ప్లేస్లో రాజ్ తరుణ్ | Raj Tharun Satamanam Bhavati in Dil Raju Banner | Sakshi
Sakshi News home page

సాయి ధరమ్ ప్లేస్లో రాజ్ తరుణ్

Published Tue, Feb 9 2016 4:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

సాయి ధరమ్ ప్లేస్లో రాజ్ తరుణ్

సాయి ధరమ్ ప్లేస్లో రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా ఓ స్టార్ వారసుడు చేయాల్సిన సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా మూడో సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, శతమానంభవతి పేరుతో మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అచ్చమైన తెలుగు కథతో తెరకెక్కనున్న ఈ సినిమా మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఇస్తుందని భావించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా సాయికి బదులుగా రాజ్ తరుణ్ను ఎంపిక చేశాడట.

ప్రముఖ రచయిత వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement