Satamanam bhavati
-
తెలుగు సినిమా ఖ్యాతిని నెలబెట్టాయి : కేవీ రమణాచారి
‘‘జాతీయస్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన దర్శక–నిర్మాతలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవించడం అభినందనీయం’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి. 64వ జాతీయ పురస్కారాల్లో ‘శతమానం భవతి’, ‘పెళ్లి చూపులు’ చిత్రాలకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా చిత్రాల దర్శక–నిర్మాతలు సతీశ్ వేగేశ్న, ‘దిల్’ రాజు, తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరి, హీరో విజయ్ దేవరకొండ, సై్టలిస్ట్ లతా నాయుడులతో పాటు 2012, 13 నంది పురస్కార గ్రహీతలు మామిడి హరికృష్ణ, నందగోపాల్, రవిచంద్రలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు కమీషనర్ విజయ్‌బాబు, ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏ రాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సెక్రటరీ మాడూరి మధు, కల్చరల్ కమిటీ ప్రెసిడెంట్ సురేశ్ కొండేటి, కోశాధికారి పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సన్మానం భవతి!
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘శతమానం భవతి’ అవార్డు గెలుపొందిన సందర్భంగా ఆ చిత్రనిర్మాత ‘దిల్’ రాజును ‘జవాన్’ చిత్ర బృందం శాలువాతో సన్మానించింది. ‘జవాన్’ హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు బీవీయస్ రవి తదితరుల సమక్షంలో కేక్ కట్ చేసి, ‘దిల్’ రాజు సంతోషాన్ని పంచుకున్నారు. సాయిధరమ్ హీరోగా ‘దిల్’ రాజు మూడు సినిమాలు నిర్మించారు. -
సడన్‌గా జర్క్..ఇప్పుడు ఎనర్జీ
-
తెలుగు సినిమా శతమానం భవతి
64వ జాతీయ సినీ అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఇందులో మూడు తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. దాదాపు కొత్తవాళ్లతో తీసిన ‘పెళ్లి చూపులు’ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంభాషణల అవార్డును గెలుచుకోగా ప్రేమానురాగాలు, ఆప్యాయతల కలబోతగా తెరకెక్కిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగాఅవార్డుకు ఎంపికైంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ను ఉత్తమ కొరియోగ్రఫీ (రాజు సుందరం) అవార్డుతోపాటు ప్రత్యేక జూరీ అవార్డు (మోహన్ లాల్) వరించాయి. ‘రుస్తుం’లో నటనకుగాను అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికవగా మలయాళ సినిమా ‘మిన్నా మినుంగ్’లో నటనకు సురభీ లక్ష్మి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. కోట్లు పెట్టి సినిమా తీస్తే అవార్డు వస్తుందా? బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడితే అవార్డులు వస్తాయా?... చిన్నవాళ్లు యాక్ట్ చేస్తే అవార్డులు రావా? తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు అవార్డులు దక్కవా? వంటి ప్రశ్నలకు 64వ జాతీయ అవార్డులు సమాధానం ఇచ్చాయి. భారీ, మీడియమ్, లో బడ్జెట్... ఇలా మూడు రకాల సినిమాలకూ పట్టాభిషేకం జరిగింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘శతమానం భవతి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘పెళ్లి చూపులు’, ‘జనతా గ్యారేజ్’కి గాను మోహన్‌లాల్‌కు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమ ఆనందించదగ్గ విషయం. విలువలున్న సినిమాలకు జ్యూరీ సభ్యులు ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఒక్క ఉత్తమ నటుడి ఎంపిక విషయంలో మాత్రం విమర్శలు వినిపించినా.. మొత్తం మీద అవార్డుల ఎంపిక పారదర్శకంగానే జరిగినట్లు అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇది నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నా
– చిరంజీవి ‘‘రామ్‌చరణ్‌కి శర్వానంద్ స్నేహితుడు. చిన్నప్ప ట్నుంచీ అతణ్ణి చూస్తే హీరో మెటీరియల్ అనిపించేది. కానీ, చాలా సౌమ్యంగా ఉండే శర్వా హీరో అవుతాడనీ, తనకి సినిమాలపై ఆసక్తి ఉందనీ అనుకోలేదు. ఓ రోజు చరణ్ సినిమాలపై శర్వా ఆసక్తి గురించి చెప్పాడు. తర్వాత ఓ వాణిజ్య ప్రకటనలో తొలిసారి నాతో కెమేరా ఫేస్ చేశాడు. నాపై తనకి ఎంత గౌరవం, ప్రేమ అంటే... ‘ఐదో తారీఖు’ సినిమా ప్రారంభించినప్పుడు నా ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్లనని మా ఇంట్లోనే కూర్చున్నాడు. తను ఇంత సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం సంతోషం. ఈ విజయం నా బిడ్డకి దక్కిన విజయంగా భావిస్తున్నా’’ అన్నారు ప్రముఖ హీరో చిరంజీవి. (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సక్సెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిం ది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌కి సన్మానం జరిగింది. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ – ‘‘వన్, టు, త్రీలలో ఈ చిత్రానికి ఏ స్థానం అని నేను చెప్పలేను. ఇట్స్ టూ ఎర్లీ. అంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేటికాలంలో ఎస్వీ రంగారవు అంతటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి గొప్ప నటుడు ప్రకాశ్‌రాజ్. ఏ పాత్రలోనైనా జయసుధ ఒదిగిపోతారు. నరేశ్ మంచి పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టేవాడు మాత్రమే అనే రీతిలో తయారైంది. అలాంటి తరుణంలో ‘దిల్’ రాజు నిర్మాతకి నిర్వచనంగా నిలబడడం గర్వ కారణం. సినిమా విజయం సాధించే వరకూ ఓ తపనతో పనిచేస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ కథను సతీశ్ నాకు చెప్పినప్పుడు, అందరి జీవితాలు కనిపించాయి. ‘బొమ్మరిల్లు’తో తెలుగులో ఏవిధంగా కుటుంబ కథా చిత్రాలు ప్రారంభమ య్యాయో, అలాగే ఈ ‘శతమానం భవతి’తో మళ్లీ ఫ్యామిలీ చిత్రాల ఒరవడి ప్రారంభమవ్వాలనే నా ఆకాంక్ష ఈరోజు నెరవేరినందుకు ఆనందంగా ఉంది. వినాయక్ ‘ఆది’తో డిస్ట్రిబ్యూటర్‌గా, ‘దిల్’తో నిర్మాతగా మారా. ‘దిల్’ సినిమా పేరుని నా ఇంటిపేరుగా మార్చారాయన. ‘శతమానం భవతి’ బాగుందం టూ చిరంజీవిగారు స్వయంగా ఫోన్ చేసి అభినం దించడం మరచిపోలేను’’ అన్నారు. ‘‘తణుకు నరేంద్ర థియేటర్లో చిరంజీవిగారి ‘ఖైదీ’ చిత్రం ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఇప్పుడు ఆయన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం పక్కన మా చిత్రం రిలీజ్ కావడం.. మమ్మల్ని అభినందించేందుకు చిరంజీవిగారు రావడం జీవితంలో మరచిపోలేని రోజు’’అన్నారు సతీశ్ వేగేశ్న. శర్వానంద్ మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకూ ఇది చేయొద్దు? అనకుండా నా ఇష్టాన్ని ప్రోత్సహించింది నా తల్లితండ్రులే. చిరంజీవి అంకుల్ ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ మరచిపోలేను. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ఆయనే అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పేందుకు వెళితే ‘నా గొప్పతనం ఏముంది. నీ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడు’’ అని చెప్పారు. ఈ వేడుకలో పలువురు పాల్గొన్నారు. -
‘శతమానం భవతి’ బృందం సందడి
– విజయోత్సవ సభకు హాజరైన హీరో, హీరోహిన్ కర్నూలు సీక్యాంప్: శతమానం భవతి చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేశారు. భరత్ థియేటర్లో సినిమా విజయోత్సవ సభ నిర్వహించారు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ తెలుగింటి సంప్రదాయాలతో వచ్చిన శతమానం భవతి చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు తప్పకుండా సినిమాలు చూస్తారని తెలుగు సంస్కృతి ఉట్టిపడే శతమానం భవతి లాంటి సినిమాలు తీయడం మంచి పరిణామమన్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సంక్రాంతి బరిలో రెండు పెద్ద చిత్రాలు పోటీపడుతున్న తరుణంలో తాము నిర్మించిన చిన్న చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మంచి చిత్రాలు తీస్తే చిన్న, పెద్ద తేడ లేకుండా అభిమానులు అదరిస్తారని ఈ చిత్రంతో రుజువైందన్నారు. హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నటీనటులు రచ్చరవి, నగరానికి చెందిన రామానాయుడు, సురేష్, లక్ష్మీనారాయణ, ఎస్ఎమ్బాషా తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రోజు నుంచి లాభాలే!
‘‘ఇప్పుడు హీరోలందరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తే మూస అవుతుందనీ, అందుకే కొత్త కథలతో సినిమాలు చేయాలనీ అనుకుంటున్నారు. శర్వానంద్ కూడా కొత్తగా కుటుంబ కథా చిత్రం చేశాడు. మంచి హిట్ అందుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘శతమానం భవతి’ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కుటుంబ ప్రేక్షకులు చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నైజాం, కృష్ణా, విశాఖలలో మేమే స్వయంగా విడుదల చేశాం. గుంటూరు, గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చేశాం. మూడో రోజుకి పెట్టిన డబ్బులు వచ్చేశాయని వారు చెబుతున్నారు. నాలుగో రోజు నుంచి లాభాలు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలకు దర్శకుడు సతీశ్ వేగేశ్న మా సంస్థలో పని చేశాడు. అతను చెప్పిన పాయింట్ నచ్చి ఏడాది పాటు కథపై వర్క్ చేశాం. హీరో నాని, ప్రకాశ్‌రాజ్ తదితరుల సలహాలు తీసుకుని సినిమా చేశాం. మొదట్నుంచీ సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నా. ఈరోజు నా నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. ఓ రాజకీయ నాయకుడు సినిమాని ఇంత విశ్లేషిస్తారా! అనిపించింది. ఓవర్సీస్లో కూడా స్పందన బాగుంది. అక్కడ మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చే అవకాశముంది. నా సమాచారం ప్రకారం సంక్రాంతికి రిలీజైన ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, మా సినిమా... మూడూ బాగా ఆడుతున్నాయి’’ అన్నారు. -
బాల్యం గుర్తొస్తోంది..!
శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘శతమానం భవతి’ ఓవర్సీస్లో ఈ 13న, ఇండియాలో 14న విడుదలవుతోంది. అమెరికాలో 12న ప్రీమియర్ షోలు వేశారు. ఈ చిత్రం గురించి శర్వానంద్ చెప్పిన విశేషాలు... సంక్రాంతి పండక్కి అత్తమామలు, పిన్నీ బాబాయ్‌లు మా ఇంటికి వచ్చి వెళ్లే వరకూ జరిగే కథతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అందువల్ల సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. గత ఏడాది మూడు పెద్ద సినిమాల మధ్య నా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విడుదలైంది. ఈసారీ అది రిపీట్ అయింది.‘ఆనందాన్ని పదిమందికి పంచితే బాగుంటుంది. కానీ, బాధని పంచి, వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు?’ అనే మనస్థత్వం గల పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో నటించా. ‘పల్లెటూరి వదలి నేను రాను. వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తా’ అని ఆలోచిస్తూ, తాతయ్య సిద్ధాంతాలను ఆయన వారసుడిగా ముందుకు తీసుకువెళ్లాలనుకునే పాత్ర ఇది. ఇది కొత్త కథ కాదు. కానీ, ఒక్క శాతం కూడా ప్రేక్షకులకు ఎక్కడా పాత సినిమాలు గుర్తుకు రావు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంటికి ఫోన్ చేసి ‘హలో అమ్మా... ఎలా ఉన్నావ్?’ అని అడుగుతారు. నాకు అంత నమ్మకం ఉంది. ఆ గ్యారెంటీ ఇస్తున్నా. తల్లిదండ్రులను మనం ఎంత ప్రేమిస్తున్నామనేది మూలకథ. మా నాన్నగారికి ఐదుగురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. చిన్నప్పుడు సంక్రాంతి వస్తే మా ఊరికి వెళ్లేవాళ్లం. రాత్రయితే పరుపులు వేసుకుని వరండాలో నిద్రపోయేవాళ్లం. సినిమాలో అలాంటి సీన్ ఉంది. అందుకని నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘దిల్’ రాజుగారితో ఆ విషయం చెబితే.. ‘సినిమా చూసేవాళ్లకి కూడా మధురమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి’ అన్నారు. మొదట్లో ఈ సినిమా చేసే ఉద్దేశం లేదు. కథ విన్న తర్వాత ‘నో’ చెప్పలేకపోయాను. ‘నువ్వే చెయ్. ఈ కథ నీకు సూటవుతుంది’ అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఖాళీగా ఉన్నానని ఏదో ఒక సినిమా చేయడం ఇష్టం లేదు. కథపై నమ్మకం కుదిరితేనే సినిమా చేస్తా. ఈ సినిమాతో నాకు ఫ్యామిలీ ప్రేక్షకులు పెరుగుతారని ఆశిస్తున్నా. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి నిర్మాణంలో చేస్తున్న సినిమా మరో ఐదు రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది. మారుతి దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక సినిమా ఒకటి అంగీకరించా! పెళ్లి గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనడిగితే... ఏదీ ప్లాన్ చేయలేదు! -
హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా!
‘‘నాకు సంతోషంగానూ, కొంచెం భయంగానూ ఉంది. నేను నటించిన ‘శతమానం భవతి’, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రాలు రెండూ సంక్రాంతికి రిలీజవు తున్నాయి. 45 ఏళ్ల నా ప్రయాణంలో కాస్త భయపడుతూ ఆనంద పడటం ఇదే తొలిసారి’’ అన్నారు జయసుధ. ఆర్. నారాయణమూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లో ఆమె హీరోయిన్గా నటించారు. ఈ 14న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ – ‘‘58 ఏళ్ల వయసులో మిడిల్ ఏజ్డ్ హీరోయిన్గా నటించా. జయసుధ, నారాయణమూర్తిల జోడి ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా. ఫస్టాఫ్‌లో సరదాగా, సెకండాఫ్‌లో హీరోతో పోటా పోటీగా ఉండే పాత్ర చేశా. చదలవాడ శ్రీనివాసరావుగారు నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. నటిగా 45 ఏళ్లు పూర్తి చేసుకున్నా. దేవుడి దయతో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా’’ అన్నారు. -
నమ్మకం లేకపోయినా కథ విన్నాడు: ‘దిల్’ రాజు
‘‘మన తల్లిదండ్రులో లేదా మనమో పల్లెటూళ్ల నుంచి వచ్చినవాళ్లమే. ఇప్పుడు మనమంతా ఉరుకుల పరుగుల జీవితంలో చాలా కోల్పోతున్నాం. ఏం కోల్పోతు న్నాం అని చూపించే మూడు తరాలకు చెందిన ఈ కథ నచ్చడంతో అంగీకరించా. పల్లెటూరు వదిలొచ్చినా.. ఈ సినిమా చూస్తే ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తాయి’’ అన్నారు ‘దిల్’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ‘శతమానం భవతి’ ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. మిక్కి జె.మేయర్ స్వరపరిచిన పాటల సీడీలను ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య విడుదల చేశారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘నా మనసుకు నచ్చిన చిత్రమిది. ఈ కథను మిస్ చేసుకోకూడదని చేశా. ప్రతి ఫ్యామిలీ చూసేలా ఉంటుంది. ఈ చిత్రంతో రాజన్న (‘దిల్’ రాజు) పై గౌరవం పెరిగింది. ఓ మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మొదట హీరోగా సాయిధరమ్ తేజ్, రాజ్‌తరుణ్ తదితరులను అనుకున్నాం. కానీ, డేట్స్ కుదరలేదు. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్. హీరోగా శర్వానంద్ అయితే బాగుంటుందనుకున్నా. పన్నెండేళ్ల క్రితం నా కారులో దర్శకుడు తేజ దగ్గరికి శర్వానంద్‌ను తీసుకువెళ్లి ‘ఈ అబ్బాయి బాగున్నాడు. చూడండి’ అని పరిచయం చేశా. తను అప్పటికి ఆర్టిస్ట్ కాలేదు. ఇప్పుడు... నేను ఫోన్ చేసి 15 నిమిషాలు కథ చెప్తే... ఫ్యామిలీ సినిమా కదా, పూర్తి కథ వింటానన్నాడు. ‘దిల్’ రాజు అయితే ఏంటి? సినిమా బాగుంటేనే చేద్దామనే అతని కాన్ఫిడెన్స్ సూపర్. కథ విన్న తర్వాత ఫోన్ చేసి ‘సినిమా చేస్తాననే నమ్మకం లేకుండానే కథ విన్నా. చాలా బాగుంది. చేస్తున్నాను’ అని నిజాయితీగా చెప్పాడు’’ అన్నారు. ‘‘నన్ను, నా కథను నమ్మి నాతో ఏడాదిన్నర ప్రయాణం చేసిన ‘దిల్’ రాజుగారికి ఈ సినిమా క్రెడిట్ దక్కుతోంది. చిన్నప్పుడు నేర్చుకున్న పితృదేవోభవ, ఆచార్యదేవోభవ పదాలకు అర్థం తెలుసుకునేటప్పటికి తల్లిదండ్రులకు దూరమవుతాం. అలాంటి ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం’’ అన్నారు సతీష్ వేగేశ్న. చిత్ర సంగీత దర్శకుడు మిక్కి జె.మేయర్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, నటుడు నరేశ్, నటీమణులు జయసుధ, ఇంద్రజ, దర్శకులు వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల, హీరోలు నిఖిల్, రాజ్‌తరుణ్ పాల్గొన్నారు. -
‘శతమానం భవతి’ ఆడియో లాంచ్
-
పర్ఫెక్ట్ ఫ్యామిలీ!
ఆ తాతా మనవళ్ల అనుబంధం చూసి మిగతా కుటుంబ సభ్యులు ముచ్చటపడతారు. అమ్మమ్మ-తాతయ్య, అత్తయ్య-మావయ్య, పిన్ని-బాబాయ్, పిల్లలు.. వాళ్ల ఫ్యామిలీ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. మరి, ఈ పర్ఫెక్ట్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ ఏంటి? తెలుసుకోవాలంటే మా సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు సతీశ్ వేగేశ్న. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘శతమానం భవతి’. ప్రస్తుతం అమలాపురంలో షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 18తో టాకీ పార్ట్, 28తో మొత్తం పాటలతో సహా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. డిసెంబర్లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్. -
ప్రేమకూ... పెళ్లికీ మధ్య!
సిటీలో ఉంటున్న అమ్మాయి సెలవులకు పల్లెటూరికి వస్తుంది. వరసకు బావయ్యే అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ జంటను దేవతలందరూ ‘శతమానం భవతి’ అని దీవించారు. మరి, కుటుంబ పెద్దల దీవెనల కోసం ఏం చేశారు? ప్రేమకూ, పెళ్లికీ మధ్య ఏమైంది? - శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శతమానం భవతి’ చిత్రకథ చూచాయగా ఇదేనట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు మొదలైంది. నవంబర్ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న అందమైన కుటుంబ కథా చిత్రమిది. హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులు. -
ఇదంతా అమ్మాయి కోసమేనా?
‘‘సిటీలో షాంపూలు, గట్రా వాడుతుంటారు గానీ.. ఇదిగో, ఇదుంది చూశావా? కుంకుడుకాయ. వేడి వేడి నీళ్లలో ఈ కుంకుడుకాయలు వేసి, ఆ రసంతో తలస్నానం చేస్తే నీ జుట్టుకి తిరుగుండదు’’ అని శర్వానంద్ చెబుతుంటే.. అనుపమా పరమేశ్వరన్ ఆశ్చర్యంగా చూస్తున్నట్టు లేదూ ఈ ఫొటో. ఇంతకీ, హీరోగారు కష్టపడి కుంకుడుకాయలు కొడుతున్నది ఆ అమ్మాయి కోసమేనా? ఇంట్లోవాళ్ల కోసమా? సంక్రాంతికి విడుదల కానున్న ‘శతమానం భవతి’ సినిమా చూస్తే తెలుస్తుంది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న అందమైన కుటుంబ కథా చిత్రమిది. హైదరాబాద్, గోదావరి పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్ రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాతలు: ‘దిల్’ రాజు, శిరీష్. -
సాయి ధరమ్ ప్లేస్‌లో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా ఓ స్టార్ వారసుడు చేయాల్సిన సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా మూడో సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, శతమానంభవతి పేరుతో మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అచ్చమైన తెలుగు కథతో తెరకెక్కనున్న ఈ సినిమా మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఇస్తుందని భావించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా సాయికి బదులుగా రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశాడట. ప్రముఖ రచయిత వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.