ఇదంతా అమ్మాయి కోసమేనా? | Sharwanand's new movie Sathamanam Bhavathi | Sakshi
Sakshi News home page

ఇదంతా అమ్మాయి కోసమేనా?

Published Tue, Oct 11 2016 8:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

ఇదంతా అమ్మాయి కోసమేనా?

ఇదంతా అమ్మాయి కోసమేనా?

‘‘సిటీలో షాంపూలు, గట్రా వాడుతుంటారు గానీ.. ఇదిగో, ఇదుంది చూశావా? కుంకుడుకాయ. వేడి వేడి నీళ్లలో ఈ కుంకుడుకాయలు వేసి, ఆ రసంతో తలస్నానం చేస్తే నీ జుట్టుకి తిరుగుండదు’’ అని శర్వానంద్ చెబుతుంటే.. అనుపమా పరమేశ్వరన్ ఆశ్చర్యంగా చూస్తున్నట్టు లేదూ ఈ ఫొటో. ఇంతకీ, హీరోగారు కష్టపడి కుంకుడుకాయలు కొడుతున్నది ఆ అమ్మాయి కోసమేనా? ఇంట్లోవాళ్ల కోసమా? సంక్రాంతికి విడుదల కానున్న ‘శతమానం భవతి’ సినిమా చూస్తే తెలుస్తుంది.

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీశ్  దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌లను దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న అందమైన కుటుంబ కథా చిత్రమిది. హైదరాబాద్, గోదావరి పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్ రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాతలు: ‘దిల్’ రాజు, శిరీష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement