పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ!
ఆ తాతా మనవళ్ల అనుబంధం చూసి మిగతా కుటుంబ సభ్యులు ముచ్చటపడతారు. అమ్మమ్మ-తాతయ్య, అత్తయ్య-మావయ్య, పిన్ని-బాబాయ్, పిల్లలు.. వాళ్ల ఫ్యామిలీ పిక్చర్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. మరి, ఈ పర్‌ఫెక్ట్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ ఏంటి? తెలుసుకోవాలంటే మా సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు సతీశ్ వేగేశ్న. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘శతమానం భవతి’. ప్రస్తుతం అమలాపురంలో షూటింగ్ జరుగుతోంది.
ఈ నెల 18తో టాకీ పార్ట్, 28తో మొత్తం పాటలతో సహా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. డిసెంబర్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్.