తెలుగు సినిమా ఖ్యాతిని నెలబెట్టాయి : కేవీ రమణాచారి
‘‘జాతీయస్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన దర్శక–నిర్మాతలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవించడం అభినందనీయం’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి. 64వ జాతీయ పురస్కారాల్లో ‘శతమానం భవతి’, ‘పెళ్లి చూపులు’ చిత్రాలకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయా చిత్రాల దర్శక–నిర్మాతలు సతీశ్ వేగేశ్న, ‘దిల్’ రాజు, తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరి, హీరో విజయ్ దేవరకొండ, సై్టలిస్ట్ లతా నాయుడులతో పాటు 2012, 13 నంది పురస్కార గ్రహీతలు మామిడి హరికృష్ణ, నందగోపాల్, రవిచంద్రలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించింది.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు కమీషనర్ విజయ్‌బాబు, ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏ రాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సెక్రటరీ మాడూరి మధు, కల్చరల్ కమిటీ ప్రెసిడెంట్ సురేశ్ కొండేటి, కోశాధికారి పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.