KV Ramana Chari
-
పురాణపండ శ్రీనివాస్‌కు ఘన సత్కారం
హైదరాబాద్: మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన కొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని హైదరాబాద్ త్యాగరాయగానసభలో అపురూప విలువల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం శ్రీనివాస్ మాట్లాడిన ప్రతీ పలుకూ సభికుల్ని తన్మయత్వానికి గురిచేశాయి. తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే.వి.రమణాచారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజులపాటు జరిగిన తెలంగాణా సాంస్కృతిక సప్తాహ వేడుకల ముగింపు ఉత్సవాన్ని శ్రీనివాస్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఉత్సవానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీమంత్రి సి.హెచ్.విద్యాసాగరరావు గౌరవ అతిధిగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. రమణాచారి వంటి ప్రతిభాశాలి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పురాణపండ శ్రీనివాస్ వంటి తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన రచయిత రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు మాట్లాడుతూ ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసి , సమర్ధ సేవలతో జాతీయ స్థాయిలో పేరుపొందిన రమణాచారి వంటి సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. భక్తి పారవశ్యపు మహా స్వరూప అత్యద్భుత గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ ఏడవసారి ప్రచురించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధాన్ని విద్యాసాగర్ రావు ఆవిష్కరించి, పురాణపండ శ్రీనివాస్ ప్రయత్నం, లక్ష్యం , దశ, దిశ, గమనం, గమ్యం అన్నీ అద్భుతంగా వుంటాయని శ్రీనివాస్ భాషలోని సొగసులు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయన్నారు. తెలుగు వాకిళ్ళలో ఇలాంటి నిస్వార్ధ ప్రతిభామూర్తిని ఎక్కడో గానీ చూడమన్నారు. ఈ వేడుకలో సంస్కృత పండితులు , ఆచార్యలు చలమచర్ల వేంకట శేషాచార్యుల్ని రమణాచారి తండ్రి రాఘవాచార్యుల స్మారక పురస్కారంతోను , ప్రముఖ లలిత సంగీత గాయకులు, లిటిల్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ రామాచారిని రమణాచారి స్ఫూర్తి పురస్కారంతోను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఏ.ఎస్.అధికారి కె.వి. రమణాచారి మాట్లాడుతూ- తన జన్మదిన వేడుకను ఇంత అందంగా , అద్భుతంగా నిర్వహించిన కళా జనార్ధనమూర్తిని అభినందించారు. సభా సమావేశాలకూ దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్ వంటి మానవవిలువల ప్రతిభాసంపన్నమైన ప్రజ్ఞ కలిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన వేడుకకు ముఖ్య అతిధిగా రావడంపట్ల తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంటూ విద్యాసాగర్‌రావు వంటి రాజకీయ వ్యక్తిత్వం మూర్తీభవించిన శిఖరం హాజరవవ్వడం పట్ల ప్రశంసలు వర్షించారు. ఈ వేడుకలో అందరినీ విస్మయపరిచే ప్రసంగం చేసి ఆకర్షించిన అరుదైన అతిధి పురాణపండ శ్రీనివాస్ ని సభపక్షాన విద్యాసాగర్ రావు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఇంత చక్కని సభను ఏర్పాటుచేసిన కళా జనార్ధనమూర్తిని జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, తెలంగాణా ప్రభుత్వ అధికారులు అభినందించారు. -
తెలుగు సినిమా ఖ్యాతిని నెలబెట్టాయి : కేవీ రమణాచారి
‘‘జాతీయస్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన దర్శక–నిర్మాతలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవించడం అభినందనీయం’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి. 64వ జాతీయ పురస్కారాల్లో ‘శతమానం భవతి’, ‘పెళ్లి చూపులు’ చిత్రాలకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా చిత్రాల దర్శక–నిర్మాతలు సతీశ్ వేగేశ్న, ‘దిల్’ రాజు, తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరి, హీరో విజయ్ దేవరకొండ, సై్టలిస్ట్ లతా నాయుడులతో పాటు 2012, 13 నంది పురస్కార గ్రహీతలు మామిడి హరికృష్ణ, నందగోపాల్, రవిచంద్రలను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు కమీషనర్ విజయ్‌బాబు, ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏ రాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సెక్రటరీ మాడూరి మధు, కల్చరల్ కమిటీ ప్రెసిడెంట్ సురేశ్ కొండేటి, కోశాధికారి పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రమణాచారికి పితృ వియోగం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి రాఘవాచార్యులు భౌతిక కాయానికి పలువురు మంత్రులు, అనధికారులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
ఘనంగా కాళోజీ జయంతి
నాంపల్లి: గ్రేటర్లో కాళోజీ శతజయంతిని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ యాసకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కాళోజీ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాళోజీ సాహిత్య సేవలను వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, ప్రము ఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి ఉపన్యసించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య స్వాగతం పలికారు. ప్రోగ్రాం ఇన్చార్జ్ ఆర్.రాంమూర్తి వందన సమర్పణ చేశారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవీ ప్రసాద్ కోరారు. కాళోజీ శత జయంతి వేడుకలు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవీ ప్రసాద్, కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, నాయకురాలు రేచల్, హైదరాబాదు జిల్లా అధ్యక్షులు ముజీబ్, నగర అధ్యక్షుడు వెంకట్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ సభ్యులు విజయ్ రావు, నాయకులు యాదగిరి రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దార్శనికుడు.. దోమలగూడ: ప్రజాకవి కాళోజీ మనస్సున్న మనిషి, భవిష్యత్ తరాలకు దార్శనికుడు అని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. దోమలగూడలోని ఏవీ కళాశాలలో తెలంగాణ భాషా సాంస్కతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ భాషా సాంస్కతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రముఖ రచయిత బుక్కా బాలరాజు, గాంధి గ్లోబల్ ఫ్యామిలీ జాతీయకార్యదర్శి గున్నా రాజేందర్‌రెడ్డి, నేటి నిజం పత్రిక సంపాదకులు దేవదాసు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కాళోజీ స్మారక చెస్ టోర్నమెంట్ విజేతలకు ఎల్లూరి శివారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఎన్ఐఎన్లో.. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో తెలంగాణ సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సదస్సు జరిగింది. ఎన్ఐఎన్ డెరైక్టర్ కల్పగం పొలాస అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. మల్లారెడ్డి, కవి, గాయకులు సుద్దాల అశోక తేజ, గోరటి వెంకన్న, పాశం యాదగిరి తదితరులు హాజరై ప్రసంగించారు. డాక్టర్ రాజేందర్రావు, భాస్కరాచారి పాల్గొన్నారు.