
అనుపమా పరమేశ్వరన్, కరుణాకరన్, సాయిధరమ్ తేజ్, కేయస్ రామారావు
‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. కరుణాకరన్ అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన అటూ ఇటూ తిరుగుతూ సెట్‌లోనే ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారు. ఇంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను కో–ఆర్డినేట్ చేసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘మా హీరో తేజు వింటర్‌లో డేట్స్ ఇవ్వమంటే సమ్మర్‌లో ఇచ్చారు (నవ్వుతూ). తేజు చాలా ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. ఈ నెల 11కి మేజర్ పార్ట్ పూర్తవుతుంది. 23, 24 తేదీల్లో విమానాశ్రయంలో షూటింగ్ జరపనున్నాం. మే మొదటి వారంలో ఫ్రాన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నాం.
‘డార్లింగ్’ స్వామి చక్కటి డైలాగులు రాశాడు’’ అన్నారు. ‘‘టైటిల్ అనుకోలేదు. ఓ మంచి టైటిల్ అనుకుని త్వరలో చెబుతాం’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్, కెమెరామెన్ ఆండ్రూ, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ.
Comments
Please login to add a commentAdd a comment