
ఇంట్లో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో బెడ్‌పై ఒకే చోటు కోసం పిల్లలు కొట్టుకోవడం సర్వసాధారణం. ఎంత తిట్టుకున్న, కొట్టుకున్న సరే రాత్రి అయితే చాలు అంతా ఒకే చోట నిద్రపోతారు. అలా తాము కూడా వరుణ్, వైష్ణవ్‌లతో కలిసి ఒకే బెడ్‌పై నిద్రపోయేవాడినని చెబుతున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్.
ఇప్పటికి కూడా ఆ అలవాటు పోలేదంటూ బెడ్‌పై వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో కలిసి నిద్రపోతున్న ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు . అందులో వైష్ణవ్ అర్దనగ్నంగా పడుకొని ఉండగా, వరుణ్ దొంగచూపులు చూస్తున్నాడు. ‘కొన్ని ఎప్పటికి మారువు’అంటూ సాయితేజ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
కాగా, మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్, బన్నీ, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ అంతా ఒకే ఏజ్ గ్రూపు వాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగారు. అందుకే వీళ్లు కజిన్స్‌లా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ గ్యాంగ్‌లో నిహారిక కూడా ఉంటుంది. ఆమెను మరదల్లా కాకుండా చెల్లిగానే చూసేవాళ్లమని గతంలో కొన్ని ఇంటర్యూల్లో సాయితేజ్, అల్లు అర్జున్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment